Mana Shankara Vara Prasad Garu Review: మన శంకరవరప్రసాద్‌గారు కొట్టారు గట్టి హిట్..అవును, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇప్పటివరకూ ఫ్లాప్ ఎలా ఉంటుందో చూడని దర్శకుడు అనిల్ రావిపూడి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడింది. మెగాస్టార్ చిరంజీవిని 90 లలో చూడాలనుకుంటే ఆ టైంకి ట్రావెల్ చేయాల్సిందే. అలా, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకులందరిని మన శంకరవరప్రసాద్‌గారుతో ట్రావెల్ చేయించాడు.
ముందు నుంచి ఈ సినిమాపై మెగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకి తగ్గట్టే మన శంకరవరప్రసాద్‌గారు సినిమా ఉండటంతో మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. నయనతార పాత్ర ఎంతో హుందాగా ఉంది. చిరు-నయన్‌లకి పెళ్ళై ఇద్దరు పిల్లలుంటారు. కొన్ని కారణాల వల్ల విడిపోయి ఉంటారు. చీఫ్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శంకరవరప్రసాద్ బాధను, గతాన్ని తెలుసుకున్న సెంట్రల్ మినిస్టర్ ఒక సహాయం చేస్తాడు.

Mana Shankara Vara Prasad Garu Review: అనిల్ రావిపూడి రాసుకున్న సీన్స్‌కి చిరు టైమింగ్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్
శంకరవరప్రసాద్ పిల్లలు చదువుతున్న స్కూల్‌కి పీఈటీ మాస్టర్‌గా పంపిస్తాడు. అక్కడ శంకరవరప్రసాద్‌ని చూసిన శశిరేఖ అక్కడ నుంచి పిల్లలని తీసుకెళ్ళిపోతుంది. ఇలాంటి సమయంలో శశిరేఖ తండ్రిపై అటాక్ జరగడంతో ఆ ఇంటికి నేషనల్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఆ టీం ని శంకరవరప్రసాద్ లీడ్ చేస్తుంటాడు. అక్కడ నుంచి మళ్ళీ మెలో డ్రామా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
కథగా చెప్పుకోవడానికి గొప్పగా ఏమీ ఉండదు. కానీ, అనిల్ రావిపూడి రాసుకున్న సీన్స్‌కి చిరు టైమింగ్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవడంతో కథ గురించి సగటు ప్రేక్షకుడు ఆలోచించేలోపే చక చకా ఫస్టాఫ్, సెకండాఫ్ అయిపోతుంది. నయన్-చిరు కాంబోలో సీన్స్, సాంగ్స్ బావున్నాయి. వెంకీది పెద్ద కీలకమైన పాత్ర కాకపోయినా, చిరు-అనిల్ కోసమే ఒప్పుకున్నాడు. భీమ్స్‌కు మెగాస్టార్ సినిమాకి పనిచేసే ఛాన్స్ దక్కింది. అయితే, అది పాటల వరకే కుదిరింది గానీ, బీజీఎం విషయంలో అంతగా గొప్పగా అనిపించదు. మొత్తంగా చూసుకుంటే వింటేజ్ మెగాస్టార్‌ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ, అనిల్ రావిపూడి బలమైన కథ-కథనాలు లేకుండా మంచి రైటింగ్ స్కిల్‌తో హిట్ కొట్టేశాడు.
Natelugu Review: చిరు-అనిల్ హిట్ కొట్టేసారు
Rating: 3/5

