Tue. Jan 20th, 2026

    Priyanka Arul Mohan: తెలుగు, తమిళ్, కన్నడ సినిమా పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటి ప్రియాంక మోహన్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తనపై కావాలనే డబ్బులు పెట్టి ట్రోల్స్ చేయిస్తున్నారని, దీని వల్ల తన సినిమా అవకాశాలు తగ్గాయని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నా నటనపై, ముఖకవళికలపై కావాలనే నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఇలా చేస్తున్నారో నాకు తెలుసు” అని షాకింగ్‌గా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభిమానులు, నెటిజన్లు “ఒక నటిపై ఇంత కక్ష పెట్టడం సరికాదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ప్రియాంక మోహన్ 2019లో నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘శ్రీకారం’ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో శివకార్తికేయన్‌తో ‘డాక్టర్’, ‘డాన్’ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కన్నడ సినిమాల్లో కూడా గుర్తింపు పొందిన ఆమె, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

    కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం, ప్రియాంక మోహన్ గతంలో ఒక ప్రముఖ PR ఏజెన్సీ (విజయ్ PRO జగదీష్ నడిపే ‘ది రూట్’ కంపెనీ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, గత ఏడాది ఆగస్టులో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని, మరో PR కంపెనీతో పని చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమెపై కావాలనే నెగటివ్ ప్రచారం, ట్రోల్స్ మొదలయ్యాయని, ఆమె చిన్న మిస్టేక్‌లను కూడా ఊదిపారేసి ట్రోల్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ PR మాఫియా ఆమె కొత్త సినిమా అవకాశాలను కూడా అడ్డుకుంటోందని రూమర్స్ ఉన్నాయి. ఈ విషయంలో ప్రియాంక భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

    priyanka-arul-mohan-they-are-deliberately-plotting-against-me
    priyanka-arul-mohan-they-are-deliberately-plotting-against-me

    Priyanka Arul Mohan: ‘ఓజీ’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు

    సెప్టెంబర్ 25, 2025న విడుదల కానున్న ‘ఓజీ’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మి విలన్‌గా, శ్రియా రెడ్డి, వెన్నెల కిషోర్, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన “గన్స్ అండ్ రోజెస్” సాంగ్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటనతో అభిమానులను ఎలా మెప్పిస్తారో చూడాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

    ప్రియాంక మోహన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభిమానులు, నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. “ఒక నటిపై కావాలనే ట్రోల్స్ చేయడం, అవకాశాలను అడ్డుకోవడం అన్యాయం” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీలో PR మాఫియా ప్రభావం, నెగటివ్ ప్రచారం గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. ప్రియాంక ఈ ట్రోలింగ్‌ను అధిగమించి, ‘ఓజీ’తో బిగ్ కమ్‌బ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.