Health: ఆహ్లాదకరమైన జీవన శైలి, సమతుల్యమైన ఆహారం శరీర ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యమైనది. నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. నిపుణుల ప్రకారం, ప్రతి వయసులోనూ నిద్ర అవసరం వేర్వేరుగా ఉంటుంది. మీ వయసుకు సరిపడ నిద్రపోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు.
నిద్ర మన శరీరానికి సహజ విశ్రాంతి. మనం నిద్రపోతున్నప్పుడు శరీరంలోని అవయవాలు తమ శక్తిని పునర్నిర్మించుకుంటాయి. క్రమంగా, రాత్రిళ్లు ఫోన్ చూస్తూ మేల్కొని ఉండటం అలవాటైపోతే అది డయాబెటిస్, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. అంతేకాదు, నిద్రలేమి కారణంగా ఊబకాయం, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ప్రస్తుత బిజీ షెడ్యూల్స్ వల్ల రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం ట్రెండ్‌గా మారింది. కానీ ఈ అలవాటు తెలియకుండానే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిద్రలేమి కారణంగా అలసట, చికాకు, ఏకాగ్రత లోపం సర్వసాధారణం. ముఖ్యంగా పిల్లల పెరుగుదలకు తగినంత నిద్ర అత్యంత అవసరం, లేకపోతే వారి ఎదుగుదలలో ఆటంకం కలుగుతుంది.

Health: వయసు ఆధారంగా నిద్ర అవసరం
వయసు ఆధారంగా నిద్ర అవసరం:
పసి పిల్లలు : రోజుకు 11–14 గంటలు
3 నుంచి 5 ఏళ్లు: కనీసం 10 గంటలు
పాఠశాల విద్యార్థులు: రోజుకు కనీసం 8 గంటలు
18–60 ఏళ్ల వయసు ఉన్నవారు: 7–9 గంటలు
60 ఏళ్లు పైబడిన వారు: కనీసం 6 గంటలు
ప్రతిరోజూ రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య నిద్రపోయి, తెల్లవారుజామున మేల్కొనడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. నిద్ర శరీరాన్ని మాత్రమే కాదు, మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది.

