Pudina: పుదీనా ఎక్కువగా మనం వంటలలో ఉపయోగిస్తూ ఉంటాము అయితే పుదీనా వంటలలో వేయటం వల్ల వంటకు మరింత రుచి రావడమే కాకుండా ఆహార పదార్థాలను మనం తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు. అయితే చాలామంది పుదీనా స్మెల్ కూడా ఇష్టపడరు. అలాగే పుదీనా కనిపిస్తే తినకుండా పక్కన పెట్టేస్తుంటారు. ఇలా పుదీనాను కనుక పక్కన పెట్టేసినట్లయితే వీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కోల్పోయినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి పుదీనా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..
ముఖ్యంగా జలుబు, దగ్గు, నోటి సమస్యలు, ఇన్ఫెక్షన్లు, గొంతు మంట, శ్వాస సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది. గొంతు లేదా నోరు మంటను తగ్గించడానికి పుదీనా ముఖ్య ఔషధంగా పనిచేస్తుంది.పుదీనా క్యాన్సర్ సమస్యలను నయం చేయడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లను తొలగించడానికి పుదీనా సహాయపడుతుంది. అందుకే ఆయుర్వేదంలో కూడా పుదీనాని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
పుదీనాను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఉదయం రెండు మూడు ఆకులను అయినా తినాలని పేర్కొంటున్నారు. పుదీనాను తినడం వల్ల చర్మవ్యాధులు చాలావరకు తగ్గిపోతాయి. ఇక పుదీనా రసంలో కాస్త నిమ్మరసం తేనె కలుపుకొని తాగటం వల్ల అలసట నీరసం వంటి సమస్యలనుంచి కూడా పూర్తిగా బయటపడవచ్చు. పుదీనా జ్యూస్ తాగటం వల్ల శరీర బరువు తగ్గడానికి కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. ఇలా పుదీనా కారణంగా ఎన్నో ప్రయోజనాలను మనం పొందవచ్చు గనుక ప్రతిరోజు ఆహారంలో భాగంగా పుదీనాను చేర్చుకోవడం మంచిది.