Pitru Paksha: హిందూమతంలో పూర్వీకులను స్మరించుకోవడం ఒక ఆనవాయితీగా ఉంటుంది అయితే పూర్వీకులను స్మరించుకోవడానికి పితృపక్షం సరైన సమయం అని భావిస్తారు. ఈ సమయంలో పెద్దవారిని స్మరించుకొని వారికి పిండ ప్రధానం చేయటం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని అలాగే మన పూర్వీకులు సంతోషం వ్యక్తం చేస్తారని భావిస్తారు. ఇక ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీన ముగుస్తుంది.
ఈ సమయంలో ఎంతోమంది పెద్దవారు ఆత్మ శాంతి కలగాలని ప్రత్యేకంగా పిండ ప్రధానం చేస్తూ ఉంటారు. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, వారి ఆశీర్వాదం పొందడానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో మనం తెలిసి తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటాము అయితే పొరపాటున కూడా ఈ తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు. పితృపక్షంలో పొరపాటున కూడా మద్యం మాంసం ముట్టుకోకూడదు. ఇలా పితృపక్షంలో వీటిని తీసుకోవటం వల్ల పూర్వీకులు ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.
పితృ పక్షం సమయంలో ప్రజలు ఎరుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఎరుపు రంగు కోపానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది. ఇక ఈ పితృపక్షంలో అబద్దాలు చెప్పకూడదు. పూర్వీకుల ప్రసన్నం చేసుకోవడం కోసం నిజాలే మాట్లాడాలి.పితృ పక్షంలో కోపం, హింసకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండి అందరితో ప్రేమగా మెలగాలి. పితృపక్షంలో అనైతిక చర్యలకు కూడా దూరంగా ఉండాలి. ఇలా ఈ పనులను పితృపక్షంలో అసలు చేయకూడదని ఇలాంటివి చేయడం వల్ల పితృదేవతల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.