Ganesh Pooja: ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను కుల మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో అలాగే వీధులలో వినాయకుడిని ఏర్పాటు చేసుకొని మూడు రోజులు లేదంటే ఐదు రోజులపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ అనంతరం నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే వినాయక చవితి ఈసారి సెప్టెంబర్ 7వ తేదీ జరుపుకోబోతున్నాము. మరి వినాయక చవితి రోజు విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం గురించి చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తుంటారు.
విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏది ఎప్పుడు ప్రతిష్టించాలనే విషయానికి వస్తే.. వినాయక చవితి పండుగను ఏడవ తేదీ ఎంతో ఘనంగా జరుపుకోబోతున్నాము అయితే విగ్రహ ప్రతిష్టకు ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:30 గంటలు వరకు సరైన సమయం అని పండితులు చెబుతున్నారు. ఇక పరిస్థితి వినాయక వ్రత సంకల్పం చేసుకోవడానికి అదే రోజు సాయంత్రం 6:22 నిమిషాల నుంచి 7:30 గంటల వరకు ఎంతో సరైన సమయమని పండితులు తెలిపారు.
ఇక ఈ సమయంలో విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రత్యేకంగా పూజలు చేయాలి అలాగే ప్రత్యేకమైన అలంకరణ అదే విధంగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలి వినాయక చవితి అంటేనే ఎక్కువగా పూర్ణాలు మోదకాలు కుడుములను నైవేద్యంగా సమర్పిస్తుంటాము అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆర్క పత్రం గరిక బిల్వదళాలతో పూజ చేయడం ఎంతో మంచిది ఇక ఎర్రటి మందారాలతో పూజించడం వల్ల వినాయకుడి అనుగ్రహం మన పైనే ఉంటుంది.