Milk: పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సంగతి మనకు తెలుసు. పాలల్లో ప్రోటీన్లు, క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే పాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలన్నింటిని పొందవచ్చు. క్యాల్షియం ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తాయి. ఇక ఇందులో ఉన్నటువంటి విటమిన్లు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అలాగే కంటి చూపును మెరుగుపరచడానికి కారణమవుతాయి. అందుకే పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇకపోతే చాలామంది ఉదయం నిద్ర లేవగానే పరగడుపున పాలు తాగుతూ ఉంటారు. మరి కొందరు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత పాలు తాగుతూ ఉంటారు. మరి పాలు పరగడుపున తాగడం మంచిదా లేకపోతే టిఫిన్ చేసిన తర్వాత తాగడం మంచిదా అనే సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే చాలామంది పాలు తాగటం వల్ల టిఫిన్ తినరనే ఉద్దేశంతో ముందు పిల్లలకు టిఫిన్ తినిపించి తర్వాత పాలు తాపిస్తూ ఉంటారు.
ఈ విధంగా టిఫిన్ చేసిన తర్వాత పాలు తీసుకోవడం వల్ల తీసుకున్న పాలు సరిగా జీర్ణం కాకపోవడంతో అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఉదయం పరిగడుపున పాలు తాగడం చాలా మంచిది. అయితే చాలామందిలో పరగడుపున పాలు తాగటం వల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.ఖాళీ కడుపుతో పాలు తాగినప్పుడు కొందరికి వికారం, వాంతులు వంటి సమస్యలు రావచ్చు. పాలు సరిగా జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అలాంటి వారు టిఫిన్ తరువాత పాలు తాగటం ఎంతో శ్రేయస్కరం.