Chicken Liver: ఇటీవల కాలంలో ముక్క లేకుండా ముద్ద దిగదు. చాలామంది ప్రతిరోజూ చికెన్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా చికెన్ తినే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా వివిధ రకాలుగా చికెన్ రెసిపీలను తయారు చేసుకొని తింటూ ఉన్నారు అయితే చాలామంది చికెన్ లివర్ తినడానికి ఇష్టపడతారు ముఖ్యంగా చిన్నపిల్లలు చికెన్ లివర్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే నిజానికి చికెన్ లివర్ తినడం మంచిదేనా ఒకవేళ తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఎలాంటి అప్రయోజనాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే..
చికెన్ లివర్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది చికెన్ లివర్ లో మనకు ఎక్కువగా ఐరన్, పొటాషియం, విటమిన్ బీ 12, కాపర్, ఎన్నో న్యూట్రిషన్లు ఉన్నాయి. అందుకే చికెన్ తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి తొందరగా బయటపడతారు అలాగే బి-12 విటమిన్ కారణంగా రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే కండరాల నొప్పులు వాపులు కూడా ఎంతగానో తగ్గిపోతాయి ఇక కంటి చూపు కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఇక మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తికి లైంగిక సమస్యలు ఉన్నా కూడా లివర్ తీసుకోవడం వల్ల తొలగిపోతాయి.
ఇక లివర్ ఆరోగ్యానికి మంచిదని చెప్పి దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చినట్టే. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు లివర్ తీసుకోకపోవడమే మంచిది అలాగే గర్భిణీ స్త్రీలు చాలా తక్కువ మోతాదులో లివర్ తీసుకోవాలి లేదంటే ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు ఉంటాయి అయితే లివర్ వండేటప్పుడు చాలా శుభ్రంగా బాగా డీప్ ఫ్రై చేసి చేసుకోవాలి అలా కాకుండా సరిగా ఫ్రై కాకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక లివర్ తినేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని తినటం ఎంతో మంచిది.