Raksha Bandhan: ప్రతి ఏడాది శ్రావణమాసంలో రక్షాబంధన్ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు అయితే ఈ రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. కనుక అన్న తమ్ముళ్లకు వారి చెల్లెలు లేదా అక్కలు రాఖీ కటి ఈ పండుగను జరుపుకుంటారు. మరి ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఏంటి అనే విషయానికి వస్తే..
ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 19వ తేదీ సోమవారం జరుపుకోబోతున్నారు. సరియైన విధానం ప్రకారం శుభ సమయంలో సోదరునికి రాఖీ కడితే అప్పుడు దేవుని ఆశీర్వాదం అతనిపై ఉంటుందని అంటున్నారు. రాఖీ కట్టేటప్పుడు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోండి. మంత్రాన్ని పఠిస్తూ రాఖీ కట్టడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. రక్షాబంధన్ రోజున సోదరీమణులు తమ సోదరుడికి ఏ మంత్రంతో రాఖీ కట్టాలో ఇక్కడ తెలుసుకుందాం..
రక్షాబంధన్ రోజున కూడా సోదరీమణులు తమ సోదరులకు కుంకుమ తిలకం పూసి అన్నంలో పెడతారు. రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖం తూర్పు వైపు, సోదరి ముఖం పడమర వైపు ఉండాలి. రాఖీ కట్టేటప్పుడు యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః, తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల ఈ మంత్రాన్ని జపించాలి. ఇలా ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడికి వచ్చే కష్టాల నుంచి ఈ బంధనం బయటపడేస్తుందని అర్థం.
రక్షాసూత్రం మూడు దారాలతో ఉండాలి. రాఖీకి ఎరుపు-పసుపు రంగు దారం ఉండాలి. ఇలా రాఖీ పండుగ రోజు రాఖీ కట్టిన తర్వాత దానిని ఏం చేయాలి అనే సందేహం కూడా అందరిలోనూ ఉంటుంది ఇలా రాఖీ కట్టిన తర్వాత మరుసటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. అయితే ఈ జన్మాష్టమి రోజు ఆ రాఖిని తీసి ఏదైనా చెట్టుకు కట్టడం లేదంటే పారుతున్న నీటిలో వేయటం మంచిది.