Clay pots: ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఏదైనా ఆహార పదార్థాలు చేయాలి అంటే తప్పనిసరిగా మట్టి పాత్రలను ఉపయోగించేవారు ఇలా వివిధ రకాల మట్టి పాత్రలను తయారు చేసుకొని అందులోనే ఆహార పదార్థాలను చేయటం వల్ల ఆహార పదార్థాలు తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనకు అందిస్తుంది. అయితే కాలక్రమేనా ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల అల్యూమినియం స్టీల్ నాన్ స్టిక్ వంట పాత్రలో అందుబాటులోకి వచ్చాయి.
ఇలాంటి పాత్రలలో ఆహార పదార్థాలను తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమని తెలుసుకున్నటువంటి ప్రజలు తిరిగి మట్టికుండలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మట్టికుండలలో ఆహార పదార్థాలను తయారు చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది కాని మనకు తెలిసి తెలియకుండా కొన్ని చేసే పొరపాట్లు కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మట్టి పాత్రలలో ఆహార పదార్థాలను తయారు చేసేకి ముందుగా ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మట్టి కుండను కొత్తగా కొన్న తరువాత వాడే ముందు మెత్తటి వస్త్రంతో శుభ్రం చేయండి. దాని కోసం ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుని బాగా తుడవాలి. ఇది పూర్తిగా శుభ్రపడి, అందులోని దుమ్ము కూడా తొలగిపోయిన తర్వాత ఒకసారి గిన్నెల సోపుతో తోమి ఎండబెట్టాలి. అలాగే ఈ పాత్రలలో వంట చేయడానికి ముందు 12 గంటలు పాటు నానబెట్టాలి ఇలా నానబెట్టిన ఈ కుండను తిరిగి కాటన్ వస్త్రంతో శుభ్రం చేయాలి అనంతరం దీనిని వంటలకు ఉపయోగించే ముందు ఆవ నూనెతో కుండలో కొంత మొత్తంలో నూనే రాసి చిన్న మంటపై కాసేపు వేడి చేయాలి ఆ తర్వాతనే ఉపయోగించుకోవాలి. ఇలా మట్టికుండలను ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.