Vastu Tips: సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడి గదిలో దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా చిత్రపటాలకు ప్రత్యేక పువ్వులతో అలంకరణ చేసి అనంతరం దీపారాధన చేసే స్వామివారిని నమస్కరించుకొని మన పనుల నిమిత్తం మనం బయటకు వెళ్ళిపోతూ ఉంటాము అయితే ఇలా దీపారాధన చేసే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను జాగ్రత్తగా పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి దీపారాధన సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి దీపాలు ఏ దిశలో వెలిగించాలి అనే విషయానికి వస్తే..
దీపారాధన చేసేటప్పుడు ఒత్తి ఎల్లప్పుడూ కూడా తూర్పు వైపుకు లేదా ఉత్తరం వైపుకు ఉండాలి. ఇక దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించాలి. దీపాన్ని ఎల్లప్పుడూ తూర్పు ముఖంగా ఉంచడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు మానసిక ఒత్తిడి తగ్గుతుంది.దీపాన్ని ఉత్తరం వైపు ఉంచడం వల్ల శ్రేయస్సు, జ్ఞానం పెరుగుతుంది. అలా కాకుండా పడమర వైపు వెలిగించడం వల్ల మానసిక ఆందోళనలు జీవితంలో ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి.
దీపాన్ని దక్షిణం వైపు ఉంచడం వలన హాని కలుగుతుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు కలుగుతాయి. జీవితం చికాకుగా చిక్కులతో సాగుతుంది. ఇక మనం దీపం వెలిగించేటప్పుడు పూజ గది మధ్యలో మనం దేవుడు చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎదురుగా వెలిగించడం మంచిది.ఇంట్లో రోజూ పూజ గదిలో దీపం వెలిగిస్తుంటే పత్తి దూదితో చేసిన వత్తిని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.