Health Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే సమస్యలలో నోటిపూత సమస్య ఒకటి. ఈ నోటి పూత కాలాలతో సంబంధం లేకుండా వస్తూ ఉంటుంది అయితే ఇలా నోటి పూత రావటం వల్ల ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు తినడానికి వీలు ఉండదు. ఎలాంటి వస్తువులు తినాలన్న చాలా కారం అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ సమస్య నుంచి బయటపడటం కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సింపుల్ చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
సాధారణంగా మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, జింక్, ఫోలికామ్లం, బి12, సి విటమిన్లు, ఐరన్ మొదలైనవి లోపించడం వల్ల కూడా నోటి పూత వస్తుంది. అంతేకాకుండా మనం ఏదైనా తినేటప్పుడు పొరపాటున కోరుక్కోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటి సమస్య వచ్చిన వారికి తేనె ఒక చక్కని పరిష్కారం అని చెప్పాలి. తేనెలో ఎన్నో ఆంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ ఉన్నాయి అందుకే ఎక్కడైతే నోటి పూత ఉంటుందో అక్కడ తేనెలో చిటికెడు పసుపు కలిపి అప్లై చేయడం వల్ల వెంటనే తగ్గిపోతుంది.
ఇక ఈ నోటిపూత సమస్యతో బాధపడేవారు కాస్త కొబ్బరి నూనెను రాయటం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు అలాగే పచ్చి కొబ్బెర లేదా ఎండు కొబ్బెరను నమ్మటం వల్ల ఈ నోటిపూత సమస్య తగ్గిపోతుంది. ఇక చాలామంది లవంగాలు లేదంటే యాలకులను కూడా నములుతారు ఇలా నమలడం వల్ల కూడా ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇలా రోజుకు నాలుగు ఐదు సార్లు చేయాలి. దీనివల్ల నోటిపూత త్వరగా తగ్గే అవకాశం ఉంది. నోటిపూత వచ్చిన వారు ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. వారు శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవాలి. ఎక్కువగా వేడి చేసే వస్తువులు తినకూడదు.