Aishwarya Kali Deepam: సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ కష్టాల నుంచి బయటపడి సంతోషంగా ఉండటం కోసం ఎంతో కష్టపడుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో రూపాయి నిలువదు ఏదో ఒక రూపంలో ఆ డబ్బు మొత్తం ఖర్చు అవుతూ ఉంటుంది. ఇలా చేతిలో చిల్లి గవ్వలేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈ సమస్యల నుంచి బయటపడటం కోసం ఎన్నో వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే ఇలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు శుక్రవారం ఐశ్వర్య కాళీ దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఈ ఐశ్వర్య కాళీ దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి అనే విషయానికి వస్తే.. ఐశ్వర్య కాళీ దీపం 11 లేదా 21 శుక్రవారం వెలిగించడం చాలా మంచిది. శుక్రవారం రోజు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని తలంటూ స్నానం చేసి ఈశాన్య దిశగా ఈ ఐశ్వర్య కాళీ దీపం వెలిగించడం చాలా మంచిది. ముందుగా ఒక పెద్ద ప్రమిద తీసుకోవాలి దానిపైకి మరొక చిన్న ప్రమిదను తీసుకోవాలి. ఈశాన్య భాగం శుభ్రం చేసి బియ్యపు పిండితో ముగ్గు వేసి అనంతరం పసుపు కుంకుమలు పెట్టాలి దానిపై పెద్ద ప్రమిదను వేసి అందులో రాళ్ల ఉప్పును పోయాలి.
ఈ ఉప్పుపై పసుపు కుంకుమ వేయాలి అలాగే పైన చిన్న ప్రమిద పెట్టి అందులో నెయ్యి లేదా నూనెను వేసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి. ఈ ప్రమిదలను పువ్వులతో అలాగే పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇక స్వామివారికి పళ్ళు పాలు పటిక బెల్లం కొబ్బరికాయ వంటివి నైవేద్యంగా పెట్టవచ్చు. లక్ష్మీ వెంకటేశ్వర స్తోత్రం కానీ కనకధార స్తోత్రం గాని చదివితే మంచిది. ఇలా శుక్రవారం పెట్టిన ఈ దీపం శనివారం తీసివేయాలి. అయితే ఆ ఉప్పు పారుతున్న నీటిలో వేయటం ఎంతో మంచిది ఇలా 11 లేదా 21 శుక్రవారం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.