Money Plant: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి ఆవరణంలో ఎన్నో రకాల మొక్కలను పెంచుతూ ఉంటారు. అయితే తప్పనిసరిగా ఆధ్యాత్మిక మొక్కలు అయిన తులసి మొక్క అలాగే మనీ ప్లాంట్ వంటివి మన ఇంటి ఆవరణంలో ఉంటాయి. అయితే మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని భావిస్తూ ఉంటారు. ఇలా మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు వాస్తు నిపుణులు.
ఇలా మనీ ప్లాంట్ పెట్టడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది అయితే మనీ ప్లాంట్ విషయంలో కొన్ని పొరపాట్లు అసలు చేయకూడదు వాటిని సరైన దిశలో నాటి సరైన విధంగా పెట్టడం వల్ల ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అలా కాదని ఎలా పడితే అలా నాటడం వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట. మరి మనీ ప్లాంట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి తప్పులు చేయకూడదనే విషయానికి వస్తే..
మనీ ప్లాంట్ మొక్కను తూర్పు లేదా పడమర దిశలో ఉంచకూడదు. ఇలా ఈ దిశలో ఉంచటం వల్ల ఇది సమస్యలను తీసుకువస్తుందట. మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలను తీసుకువస్తుంది. మనీ ప్లాంట్ మొక్క ఈ దిశల్లో ఉండకుండా చూసుకోండి. ఈశాన్య మూలలో పెంచుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ దగ్గరలో ఎరుపు రంగు ఉండే వస్తువులను పెట్టకూడదు.మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే దాని చుట్టూ ఉండే ప్రదేశం కాస్త విలాసవంతంగా ఉండేలా చూసువాలి. ఇరుకుగా ఉండకూడదు. మీరు ఎప్పుడైనా మనీ ప్లాంట్ మొక్కను కొనుగోలు చేసినప్పుడు వాటి ఆకులు హార్ట్ షేప్ లో ఉన్నవి చూసి కొనుగోలు చేయటం మంచిది.