Health Tips: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వానలు అధికంగా పడుతున్న నేపథ్యంలో నీరన్ని కూడా కలుషితమవుతున్నాయి. అలాగే ఇంటి పరిసర ప్రాంతాలు కూడా ఎక్కువగా చిత్తడిగా ఉన్న నేపథ్యంలో తొందరగా అనారోగ్యాలు వ్యాప్తి చెందే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే కలరా డయేరియా మలేరియా వంటి వ్యాధులు అధికమవుతున్నాయి. ఇలాంటి సీజనల్ వ్యాధులను అరికట్టడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అనే సంగతి మనకు తెలిసిందే.
ముఖ్యంగా మన ఇంటి ఆవరణంలోనూ ఇంటి పరిసర ప్రాంతాలలో ఎక్కడ నీరు నిల్వకుండా జాగ్రత్తపడాలి ముఖ్యంగా పూల కుంపట్లలో నీరు లేకుండా చూసుకోవాలి. ఇలా ఇంటి పరిసర ప్రాంతంలో నీరు నిలవకుండా చూసుకోవడం వల్ల దోమల పెరుగుదలను అరికట్టవచ్చు తద్వారా మలేరియా డెంగ్యూ వంటి వాదులను కూడా పూర్తిగా అరికట్టవచ్చు. ఇక వర్షం రావడంతో నీరు కూడా బాగా కలుషితమైన నేపథ్యంలో కలరా డయేరియా వంటి వ్యాధులు రావడానికి కూడా కారణమవుతుంది.
ఇలా వర్షాకాలంలో నీరు కలుషితం అవుతాయి కనుక ప్రతి ఒక్కరు నీళ్లను కాంచి చల్లార్చుకొని తాగటం వల్ల డయేరియా నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా మనం ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలపై ఈగల వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మనం ఏదైనా తినడానికి ముందుకు తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడగడం ఎంతో ముఖ్యం. ఇలా ఇంట్లో కూడా పరిశుభ్రతను పాటించడం వల్ల ఈ సమస్యల నుంచి పూర్తిగా దూరంగా ఉండవచ్చు. ఈ సీజనల్ వ్యాధుల నుంచి బయటపడాలి అంటే పరిశుభ్రత ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.