Mobile Phone: ప్రస్తుత కాలంలో చేతిలో ఫోన్ లేకుండా ఏ ఒక్కరు కనిపించరు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు కూడా సెల్ఫోన్ చేతిలో పట్టుకొని కనిపిస్తూ ఉంటారు. ఇలా ఒక్క క్షణం పాటు మొబైల్ ఫోన్ చేతిలో లేకపోయినా వారికి దిక్కు తోచదు. ముఖ్యంగా చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లో గేమ్స్ వీడియోస్ అంటూ తినడం కూడా మానేసి పూర్తిగా ఫోన్ కి పరిమితమవుతున్నారు. ఇలా గంటలు తరబడి ఫోన్ ఉపయోగిస్తూ ఉన్నట్లయితే వాళ్లు పెద్ద ఎత్తున ప్రమాదంలో పడినట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
24 గంటలలో చాలామంది ఫోన్ చూడటానికి అధిక సమయం ఉపయోగిస్తుంటారు నిజానికి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడాలి అంతకుమించి వాడితే ఎలాంటి ప్రమాదాలు తలెత్తుతాయనే విషయానికి వస్తే.. చిన్నపిల్లలు మొబైల్ ఫోన్ కనుక చూస్తున్నట్లయితే వారు రోజుకి 2 గంటలకు మించి ఫోన్ చూడకూడదు.అంతకుమించి చూడటం వల్ల కళ్ళపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది అలాగే మెడ నొప్పి సమస్య కూడా తలెత్తుతుంది.
ఇక పెద్దవారు రోజుకు కేవలం మూడు లేదా నాలుగు గంటలు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక మీరు కనుక మొబైల్ ఫోన్లోను లేదంటే కంప్యూటర్లలో కనుక పనిచేస్తున్నట్టయితే ప్రతి అరగంటకు 10 నిమిషాల పాటు విరామం ఇవ్వటం ఎంతో మంచిది అప్పుడే కళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది కంటి చూపు పై ప్రభావం చూపించదు. ఇక వృద్ధులు రోజుకు కేవలం 1 లేదా 2 గంటలు మాత్రమే ఫోన్ చూడాలి అంతకుమించి ఎక్కువ ఫోన్ చూడటం వల్ల వారి కంటి చూపు పై తీవ్రమైన ప్రభావం ఏర్పడుతుంది. ఇలా ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల శారీరక శ్రమ తగ్గడమే కాకుండా మానసిక ఆందోళన కంటిచూపుపై ప్రభావం ఒత్తిడి ఏర్పడుతుంది. నిద్రలేమి సమస్యలతో కూడా బాధపడాల్సి ఉంటుంది కనుక వీలైనంతవరకు మొబైల్ ఫోన్ దూరం పెట్టడం మంచిది.