Health Tips: సాధారణంగా చాలామంది నిద్రపోతున్న సమయంలో గురకపెట్టే అలవాటు ఉంటుంది. కొన్నిసార్లు ఈ గురక పని ఒత్తిడి కారణంగా అలసిపోయి నిద్రపోతే గురక వస్తుంది అలాగే మరికొన్నిసార్లు శ్వాస సమస్యలు తలెత్తిన కూడా కొందరికి గురక వస్తుంది. ఇలా గురక పెట్టడం వల్ల వారు ప్రశాంతంగా నిద్రపోయిన పక్క వారికి మాత్రం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది అయితే దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ఎత్తున అది ప్రమాదకరంగా వారే అవకాశాలు ఉన్నాయి.
ఇలా గురక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఎంతోమంది ఎన్నో రకాల చికిత్సలను తీసుకొని ఉన్నా కానీ ప్రయోజనం ఉండదు అయితే ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఇలా గురక సమస్యతో బాధపడేవారు ఇంట్లోనే సింపుల్ చిట్కాలను కనుక ఉపయోగిస్తే ఈ గురక సమస్య నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు మరి గురక సమస్య నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే..
ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు ఒక చుక్క గోరువెచ్చని నెయ్యిని రెండు ముక్కు రంద్రాలలో వేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడటం ప్రశాంతకరమైన నిద్ర రావడంతో పాటు మానసిక ఆరోగ్య స్థితి కూడా పెంపొందుతుంది. చాలా మందిలో గురకకు ఒత్తిడి కారణం. అటువంటి పరిస్థితిలో ప్రతికూల ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మనశ్శాంతిని కలిగి ఉండటానికి నిద్రించేముందు ధ్యానం చేయడం అవసరం. దీనితో పాటు, రాత్రి పడుకునే ముందు మీ పాదాలకు థైమ్ ఆయిల్ రాయండి. ఇలా చేయటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.