Vastu Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే త్వరలోనే రాబోయే జ్యేష్ఠ మాసానికి కూడా అంతే ప్రాధాన్యత ఉందని చెప్పాలి.ఈ రోజు చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఈ తేదీన చంద్రుడు తన పూర్తి రూపంలో కనిపిస్తాడు. ఎంతో ఈ పవిత్రమైన రోజున మనం కొన్ని పరిహారాలను పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో పాటు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఉదయమే గంగా స్నానం చేయాలి అనంతరం బ్రాహ్మణుడికి చంద్రుడికి ఎంతో ఇష్టమైనటువంటి తెల్లటి వస్త్రాలను బియ్యం పాలు పెరుగు వంటి వాటిని దానం చేయటం వల్ల మన జాతకంలో చంద్రుని స్థానం బలపడి సంతోషాలు వెల్లువిరుస్తాయి.జ్యేష్ఠ పూర్ణిమ రోజున గంగా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయాలి. ఈ రోజున లక్ష్మీ దేవిని, విష్ణువును పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఎప్పుడూ ఉండదు. ఈ రోజున గంగా స్నానం, దానధర్మాలు, సత్యన్నారాయణ ఉపవాసం, చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా ఫలవంతంగా పరిగణిస్తారు.
ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే – జ్యేష్ఠ పూర్ణిమ నాడు చంద్రోదయం తర్వాత పాత్రలో పాలు నింపి అందులో పంచదార, పచ్చి బియ్యం కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ సమయంలో చంద్ర మంత్రాన్ని జపించాలి. ఇది ఆర్థిక సమస్యలను తొలగిస్తుందని, మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందని నమ్ముతారు. జ్యేష్ఠమాసం పౌర్ణమి తిథి జూన్ 21, 2024 ఉదయం 6:01 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ జూన్ 22, 2024 ఉదయం 5:07 గంటలకు ముగుస్తుంది. జూన్ 21, శుక్రవారం నాడు జ్యేష్ఠ పూర్ణిమ ఉపవాసం పాటిస్తారు.