Akshaya Tritiya: అక్షయ తృతీయ హిందువులకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఆ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దీపావళి రోజు ఏ విధంగా అయితే మనకు ధన త్రయోదశి కీలకంగా ఉంటుందో అలాగే అక్షయ తృతీయ రోజు కూడా లక్ష్మీదేవికు ప్రత్యేకంగా పూజలు చేసి ఆ రోజున బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
ఈ విధంగా అక్షయ తృతీయ ప్రతి ఏడాది జరుపుకుంటూ ఉంటాము అయితే ఈ ఏడాది మే 10వ తేదీ అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగ రోజు ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు నైవేద్యాలు చేసిన అనంతరం అమ్మవారిని ప్రార్థించాలి అలాగే ఆరోజు మన శక్తి సామర్థ్యాల మేరకు బంగారం కొనటం ఎంతో మంచిదని భావించి చాలామంది బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తూ ఉంటారు.
అయితే చాలామందికి బంగారం వెండి కొనే స్తోమత లేకపోయినా సరే పేదలకు అన్నదానం చేసిన మంచి పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇకపోతే బంగారం వెండి ఆభరణాలు మాత్రమే కాకుండా అక్షయ తృతీయ రోజు భూమి కొనుగోలు చేసిన లేదంటే కొత్త ఇల్లు వాహనాలు కొనుగోలు చేసిన కూడా ఎంతో శుభకరమేనని పండితులు చెబుతున్నారు. అయితే ఎవరు శక్తి సామర్థ్యాల మేరకు వారు కొనుగోలు చేస్తూ ఉంటారు కానీ బంగారం వెండి మాత్రమే కొనాలని పట్టింపులేదని ఏ వస్తువు కొన్న మంచిదేనని పండితులు తెలుపుతున్నారు.