Ugadi: 8 ఏప్రిల్ 2024 ఫాల్గుణ మాస బహుళ పక్ష అమావాస్య తిథి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అఖరి రోజు. అతిపెద్ద సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో సంభవించదని అందువల్ల భారతదేశంలో గ్రహణ సూతకం వంటివి పాటించాల్సిన అవసరంలేదు అయితే ఈ సూర్యగ్రహణం ఉగాది పండుగ రోజు ఏర్పడుతుంది కాబట్టి ఆ రోజు దేవాలయాలని కూడా భక్తులతో కిటికీటలాడుతూ ఉంటాయి.
ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఈ ప్రభావం పండుగపై ఏమాత్రం ఉండదని తెలుస్తుంది అయితే ఈ సూర్యగ్రహణ ప్రభావం కొన్ని రాశుల వారికి శుభాలను కలిగించగా మరికొన్ని రాశుల వారు ఈ సూర్యగ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలుగు వారు కూడా ఈ గ్రహణ నియమాలను పాటించడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ సంపూర్ణ సూర్య గ్రహణం రేవతి నక్షత్రం మీన రాశిలో ఏర్పడటం చేత మీనరాశిలో రవి, చంద్ర, శుక్ర, రాహువులు ఉండటం చేత ఇతర దేశాలలో ఉన్న మీనరాశి జాతకులు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటమే మంచిది.
సూర్యగ్రహణం సమయంలో సూర్యారాధన ,దుర్గాదేవిని ఆరాధించడం, గ్రహణ శాంతులు వంటివి చేసుకోవడం వల్ల మనపై ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక సూర్యగ్రహణం మీనరాశిలో ఏర్పడటం వల్ల పశ్చిమ దేశాలకు అరిష్టాన్ని ఈ గ్రహణం సూచిస్తోంది. పశ్చిమ దేశంలో ఉన్నటువంటి వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తుంది అలాగే ఈ గ్రహణం కారణంగా మీనరాశి వారు కాస్త ఉద్యోగ , ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.