Stomach pain: సాధారణంగా చాలామంది భోజనం చేసిన తర్వాత తిన్న భోజనం జీర్ణం అవ్వడానికి ఎన్నో రకాల పదార్థాలను తింటూ ఉంటారు అయితే మరి కొంత మంది భోజనం చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే కొంతమంది భోజనం చేసిన వెంటనే కడుపు మొత్తం ఏదో తిమ్మిరిగా నొప్పిగా ఉంటుంది ఇలా భోజనం తర్వాత ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నటువంటి తరుణంలో చాలామంది భోజనం చేయడానికి కూడా ఇష్టపడరు.
ఈ విధంగా భోజనం చేసిన తర్వాత కడుపులో నొప్పిగా కనుక ఉంటే మామూలే కదా అని ఏమాత్రం అలసత్వం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతిసారి భోజనం చేసిన వెంటనే కడుపులో నొప్పి లేదా తిమ్మరిగా ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఎంతో ముఖ్యం ఎందుకంటే ఇది అల్సర్ కి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
అల్సర్ అనేది మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఎక్కువగా మసాలాలు ఉన్నప్పుడు కూడా ఏర్పడుతూ ఉంటుంది. లేదంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఉద్యోగ పనుల నిమిత్తం బిజీగా ఉండటం వల్ల సమయానికి భోజనం చేయడం లేదు ఇలా సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కూడా అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ఫుడ్ పాయిజనింగ్ వల్ల కూడా తిన్న తర్వాత కడుపు నొప్పి, తిమ్మిరి లాంటి సమస్యలు వస్తాయి. దీనికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇలా భోజనం చేస్తున్న వెంటనే కడుపులో నొప్పిగా ఉంటుంది. ఇలా ప్రతిసారి ఈ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.