Devotional Facts: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎంతోమంది దేవదేవతలను పూజిస్తూ ఉంటాము. అంతేకాకుండా ఎన్నో రకాల పక్షులు, చెట్లు, జంతువులను కూడా దైవ సమానులుగా భావించి పూజలు చేస్తూ ఉంటాము. అయితే మన ఇంట్లో పెరిగే కుక్కలను కూడా చాలామంది దైవ సమానంగా భావిస్తూ ఉంటారు. కుక్క కాలభైరవ దేవుడితో సమానమని భావించి కుక్క పట్ల ఎవరు కూడా దురుసుగా ప్రవర్తించరు.
అయితే కుక్కకు కనుక పూజ చేసి రొట్టెలు పెడితే మనకు కుజదోషం ఉంటే తొలగిపోతుందని జగిత్యాల జిల్లా వాసులు బాగా విశ్వసిస్తున్నారు ఈ జిల్లాలో ప్రజలు కుక్కకి పూజ చేస్తే కుజ దోషం తొలగిపోతుందని చెబుతున్నారు. దత్తాత్రేయ స్వామి దగ్గర శునకం ఉంటుంది.. ఆయన అనుగ్రహం పొందుతుంది.. ఉత్తర భారత దేశంలో అయితే, చాలా వరకు శునకాలకు రొట్టెలు పెట్టి పూజిస్తారు. హిందూ మతంలో శునకానికి ప్రత్యేక స్థానం ఉంది.
ఈ క్రమంలోనే జగిత్యాల వాసులు కుక్కకు రొట్టె పెట్టి పూజలు చేయడం వల్ల కుజదోషంతోపాటు మరణ దోషాలు కూడా తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున కుక్కలకు పూజిస్తూ రావడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇకపోతే మహాభారతం మొదలైనప్పుడు , మహాప్రస్థానం సమయంలో, యముడు కుక్క రూపంలో కనిపించాడని అప్పటి నుంచి కుక్కను పూజించడం మొదలు పెట్టారనీ చెప్పాలి.