Summer: మార్చి పూర్తి కాకుండానే వాతావరణంలో ఉష్ణోగ్రతలలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి ఒక్కసారిగా టెంపరేచర్ పెరిగిపోవడంతో ఇంటి నుంచి కాలు బయటకు పెట్టాలి అంటే కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ఎండలు భారీ స్థాయిలో మండిపోతున్నాయి. ఇలా బానుడి ప్రతాపం తట్టుకోవడానికి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అయితే కొన్ని పరిస్థితులలో మనం తప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి.
ఇలా ఎండాకాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వడదెబ్బ బారిన పడకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండలో మండిపోతున్నటువంటి వేల మనం ఆహార పదార్థాల కంటే పండ్ల రసాలు, నీటి శాతం అధికంగా కలిగినటువంటి పనులు తీసుకోవటం ఎంతో మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీలైనంతవరకు మన శరీరాన్ని హైడ్రేషన్ ఉండేలా చూసుకోవాలి ఎప్పుడైతే డిహైడ్రేషన్ కి గురి అవుతాము. తప్పకుండా స్పృహ కోల్పోయే పరిస్థితిలో వస్తాయి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా కాటన్ దుస్తులను వేసుకోవడం ముఖ్యం అలాగే గొడుగు లేదంటే క్యాప్ పెట్టుకొని బయటకు వెళ్ళటం మంచిది. ఇక ఎండాకాలంలో తప్పనిసరిగా లంచ్ బ్రేక్ ఫాస్ట్ లాంటివి స్కిప్ చేయకుండా తినాలి అంతే కాకుండా మధ్య మధ్యలో పండ్ల రసాలు పండ్లు కూడా తినటం మంచిది.ఇక బయటకు వెళ్లేవారు వీలైనంతవరకు ఉదయం11 గంటల లోపు పనులను పూర్తి చేసుకొని రావటం మంచిది లేదంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవడం ఇంకా మంచిది. ఇలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వడదెబ్బకు గురి కాకుండా ఉండవచ్చు. ముఖ్యంగా ఎండాకాలం ఏ విధమైనటువంటి మసాలా ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది.