Vastu Tips: సాధారణంగా మనం మన ఇంటి నిర్మాణ సమయంలో ఎంతో పెద్ద మొత్తంలో కలప ఉపయోగిస్తూ ఉంటాము ఇంటికి సంబంధించినటువంటి ఇంటీరియర్ డిజైన్ తయారు చేయడానికి కలప విపరీతంగా వాడుతాము. అంతేకాకుండా వివిధ రకాల వస్తువులను తయారు చేయడానికి కూడా చక్కని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము అయితే కొన్ని రకాల మొక్కల నుంచి చెక్కను తయారు చేసి వస్తువులు చేయించి ఇంటికి తీసుకురావడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి కలపను ఇంటిలోకి తీసుకురాకూడదు అనే విషయానికి వస్తే..
మనం ఇంటిలో ఏదైనా ఫర్నిచర్ చేయించాలి అన్నా లేదా ప్రధాన ద్వారం వంటి వాటిని చేయించాలి అన్నా కూడా టేకు చెక్క ఎంతో మంచిదిగా భావిస్తూ ఉంటారు. అలా కాకుండా ఏ చెట్టు నుంచి అయితే మనం ఆకులు తెంపిన లేదా కొమ్మ కొట్టిన పాలు కారుతాయో అలాంటి మొక్కల నుంచి తయారు చేసినటువంటి వస్తువులను ఇంటికి పొరపాటున కూడా తీసుకురాకూడదు ఇలాంటి కలప ఇంటికి రావడం వల్ల ఇంట్లో శాంతి కోల్పోయి మానసిక అలజడులు ఆందోళనలు కలుగుతాయి.
పొరపాటున కూడా ఈ విధమైనటువంటి కలపను ఇంటికి తేకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు ఎండిపోతున్నటువంటి మొక్కలకు సంబంధించిన కలపను అలాగే చెదలు పట్టిన కలపను కూడా ఇంటికి తీసుకురాకూడదు అలాగే స్మశానంలో పెరుగుతున్నటువంటి మొక్కలను కొట్టి వాటితో ఏదైనా ఫర్నిచర్ తయారు చేయించుకొని ఆ వస్తువులను కూడా ఇంటికి తీసుకురాకూడదు ఇలాంటి మొక్కలను ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోయి అనుకున్న పనులు సవ్యంగా సాగవు అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా మనల్ని వెంటాడుతాయి.