Niharika Konidela : మెగా ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి పైకి వచ్చారో సినీ రంగంలో కెరీర్ ప్రారంభించిన ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే మెగాస్టార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. అయితే మెగాస్టార్ ఫ్యామిలీలో నిహారిక మాత్రమే నటిగా ఇండస్ట్రీకి వచ్చింది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన నిహారిక 2020 లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల రీసెంట్ గా డివోర్స్ తీసుకున్నారు. అప్పటి నుంచి సింగల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది నిహారిక. ఈ మధ్యనే పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తన మ్యారీడ్ లైఫ్ ఎందుకు ఇలా అయ్యిందో ఎమోషనల్ గా షేర్ చేసుకుంది నిహారిక. ప్రస్తుతం విడాకుల తర్వాత తన కెరీర్ పైన దృష్టి సారించింది. ఒకప్పుడు నటి అయిన నిహారిక ఇప్పుడు సొంత ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసింది నిహారిక. త్వరలోనే కొత్త సినిమా షురూ చేయబోతోంది. ఇదిలా ఎంటే అత్తింటినే కాదు ఇప్పుడు నిహారిక పుట్టింటిని కూడా వదిలి వెళ్లేందుకు రెడీ అయ్యింది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటో తెలుసుకునేందుకు మెగా అభిమానులు తెగ ట్రై చేస్తున్నారు.
గత కొంత కాలంగా నిహారిక కొణిదెల ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. సినిమా విషయాల కన్నా పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన న్యూస్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది. డివోర్స్ తర్వాత ఫ్రీడమ్ గర్ల్‌గా తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఇప్పుడేమో పుట్టింటిని వదిలి ఒంటరిగా మరో మకాం పెట్టబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అయ్యింది. వదిన లావణ్య త్రిపాఠితో గొడవలే అందుకు కారణం అని కొంత మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది నిజయం కాదని తాజాగా తెలిసింది. ఎందుకంటే వీరిద్ది మధ్య మంచి బాండింగ్ ఉంది. నిజానికి నిహారిక లావణ్యతో చాలా క్లోజ్ గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటుంది. అన్న వరుణ్ తేజ్ తో వివాహానికి ముందే లావణ్య, నిహారికతో ఫ్రెండ్ షిప్ చేసింది. సో వీరిద్దరికి ఎలాంటి గొడవలు లేవన్న క్లారిటీ వచ్చింది.
ఇదే క్రమంలో తల్లిదండ్రుల ఇంటి నుంచి ఎందుకు నిహా వెళ్లాలనుకుంటుందో లావణ్యకు, అన్నకు చెప్పిందట. తనకు ఒంటరిగా ఉండాలంటే ఇష్టమని చెప్పిందట.అందుకే తనకోసం స్పెషల్ గా ఓ ఇల్లు కట్టుకుంటోందట. ఇంటి నిర్మాణానికి సంబంధించిన డబ్బులను సైతం తానే సంపాదించుకుందట. డబ్బులు సరిపోకపోతే నాన్న నాగబాబు నుంచి అప్పుగా తీసుకుని మళ్లీ ఇచ్చేస్తాని చెప్పినట్లు న్యూస్ నెట్టింట్లో స్ప్రెడ్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నిహారికకు మరింత ఫ్రీడమ్ దొరికుతుందని అనుకుంటున్నారు.