Eyes: ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసులోనే ఎంతోమంది గుండె జబ్బులతో బాధపడుతూ సతమతమవుతున్నారు. ఇలా గుండె జబ్బుల కారణంగా ఎన్నో మరణాలు కూడా సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా చిన్న వయసు నుంచి మొదలుకొని పెద్ద వయసు వారు వరకు గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. అయితే మనం కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల ఈ గుండెపోటు సమస్య నుంచి బయటపడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
గుండెపోటు రావడానికి ముందుగా మన శరీరంలో కొన్ని లక్షణాలు మనకు బయటపడుతూ ఉంటాయి. వీటిని గనక గుర్తించి వైద్యున్ని సంప్రదిస్తే గుండెపోటు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అయితే గుండె సమస్య ఉన్నవారి కళ్ళల్లో కూడా మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కళ్ళల్లో కనుక ఈ మార్పులు వస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది.
కళ్ళు కింద భాగంలో చాలా ఉబ్బినట్టు కనక కనపడితే మీకు రక్తప్రసరణ సరిగా జరగలేదని తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని సంకేతం ఇలా కన్నీళ్లు మొత్తం ఒకే చోటకు చేరటం వల్ల కళ్ళు ఉబికినట్టు కనిపిస్తాయి. అంతేకాకుండా రక్తప్రసరణ వ్యవస్థ లేకపోవడం వల్ల కనురెప్పలు కూడా బలహీనంగా మారి రాలిపోతూ ఉంటాయి.
ఎప్పుడైతే కళ్ళకు రక్త సరఫరా అనేది సరిగ్గా జరగదు ఆ క్షణంలో కళ్ళల్లో కూడా మార్పులు వస్తాయి కళ్ళు ఎరుపుగా మారడం లేదా పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. ఆ సమయంలో మనం వెంటనే వైద్యున్ని సంప్రదించడం ఎంతో మంచిది ఇలాంటి లక్షణాలు కనుక మన కళ్ళల్లో కనిపించినట్లు అయితే మన శరీరం రక్తప్రసరణ వ్యవస్థను కోల్పోతుందని తద్వారా మనకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.