Health Tips: సాధారణంగా కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల మనకు తెలియకుండానే చాలా వికారంగా అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా వాంతి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది తప్ప రాదు తద్వారా ఎంతో ఇబ్బందులలో ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైనా మాట్లాడించినా చిరాగ్గానే ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు పడుకున్న నిద్ర రాదు. ఇలా వికారం కారణంగా చాలామంది సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.
ఇక చాలామందికి ఏసీలో ప్రయాణం చేయడం నచ్చదు అలాగే మామూలు ప్రయాణం చేసిన వాంతి కలిగే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవారు వెంటనే ఈ ఫీలింగ్ నుంచి బయటపడి రిలీఫ్ అవ్వాలి అంటే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు వికారంగా ఉండి వాంతి వచ్చినట్టే ఉంటూ రానివారు ఒక లీటరు గోరువెచ్చని నీటిని తాగేయాలి ఇలా ఒకేసారి ఒకే లీటర్ నీటిని తాగటం వల్ల మన కడుపులో ఏదైతే అరగని పదార్థం ఉంటుందో అది వాంతి రూపంలో బయటకు వస్తుంది తద్వారా రిలీఫ్ అవ్వచ్చు.
ఇక చాలామంది ప్రయాణం చేసేటప్పుడు వాంతి చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఫీలింగ్ ఉన్నవారు విండోస్ సీట్ పక్కన కూర్చోవాలి కేవలం ఏసీ పైనే ఆధార పడకుండా బయట గాలి వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా పులుపు కలిగినటువంటి చాక్లెట్స్ తింటూ ఉండటంవల్ల వాంతి కలగదు అలాగే పుదీనా, నిమ్మకాయ, పెప్పర్‌మింట్ ఆయిల్ వంటివి బాగా హెల్ప్ చేస్తాయి. వీటి వాసన చూస్తే కనుక వికారం సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు.