Vastu Tips: సాధారణంగా మనం ఎన్నో రకాల వస్తువులను ఆధ్యాత్మిక భావనతో పూజిస్తూ ఉంటాము అలా పూజించే వస్తువుల పట్ల జాగ్రత్తలను కూడా తీసుకుంటూ ఉంటాము మన ఇంట్లో ఉపయోగించే ఉప్పు పసుపు కుంకుమలను ఆధ్యాత్మిక భావనతోనే చూస్తూ ఉంటాము. ఇలా దైవ సమానంగా భావించే కొన్ని వస్తువులు పొరపాటున కూడా కింద పడటం వల్ల అప శకనం జరుగుతుందని భావిస్తూ ఉంటారు. మరి పొరపాటున కూడా కింద పడకుండా చూసుకోవాల్సిన ఆ వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే..
మన హిందూ శాస్త్రం ప్రకారం ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము అలాంటి ఉప్పు పొరపాటున కూడా కింద పడకూడదని పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఉప్పు కింద పడిపోయింది అంటే మన జాతకంలో బలహీనంగా శుక్రుడు, చంద్రుడు ఉన్నట్టు చెబుతారు. ఇది వ్యక్తుల ఆరోగ్య జీవితంపై, కుటుంబ జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
ఇక ఉప్పుతో పాటు పొరపాటున నూనె కూడా చేయి జారి పడిపోకూడదు నూనె కింద పడిపోవడం అంటే శనికి ఆగ్రహం తెప్పించటమే. శని నూనెలపై ఆధిపత్యం కలిగి వుంటాడు. జాతకంలో శని ప్రతికూల ఫలితాలు ఇచ్చే సమయంలో చేతుల నుండి నూనె జారిపడుతుంది. ఇలా కనుక నూనె జారిపోయింది అంటే శని ప్రభావం మనపై చూపుతుందని తద్వారా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చే పరిస్థితులు ఉన్నాయని అర్థం. ఇక పూజ చేసే సమయంలో ఒక పళ్లెంలో మనం పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకొని ఉంటాము ఇలా పూజ పళ్లెం కనుక కింద పడిపోయింది అంటే దేవుడి కరుణ కటాక్షాలు మనపై ఉండవని అర్థం అందుకే ఈ వస్తువులను పొరపాటున కూడా కింద పడకుండా చూసుకోవాలి.