Shani Dosham: సాధారణంగా శని దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలోను ఏదో ఒక సమయంలో తన ప్రభావాన్ని వారిపై చూపిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము మనం చేసే కర్మలకు తగ్గ ఫలితాలను శని దేవుడు అందిస్తూ ఉంటారు. అయితే ఇలా ప్రభావానికి గురైన సమయంలో శని దేవుడి అనుగ్రహానికి గురి కావాలి అంటే ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారు.
ఇలా శనిదేవుడి అనుగ్రహం పొందటం కోసం శనివారం వివిధ రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు అయితే నీలిరంగు శంకు పుష్పాలను శని దేవుడికి సమర్పించి పూజ చేయడం వల్ల శని దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. శనివారం రోజు స్నానం చేసి చాలా నియమనిష్టలతో ఈ నీలిరంగు శంకు పుష్పాలను శని దేవునికి సమర్పించి పూజించడం ఎంతో మంచిది.
ఇలా నీలిరంగు శంకు పుష్పాలతో శనీశ్వరుడిని పూజించడానికి అనువైన సమయం సూర్యోదయాన్ని కంటే ముందుగాను లేదా సూర్యస్తమయం తరువాత అయినా కూడా ఈ పుష్పాలతో పూజ చేయటం వల్ల శని దేవుడు అనుగ్రహం మనపై ఉండే శని బాధలు తొలగిపోతాయి. శనివారం నాడు శని దేవుడి ముందు ఆవనూనె దీపాలు వెలిగించాలి. శని దేవుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించటం వల్ల శని ప్రసన్నం అవుతాడు. శనిదేవుని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా శని విగ్రహాన్ని తాకకూడదు.