Anjali : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది తెలుగమ్మాయి అంజలి. టాలీవుడ్ టాప్ హీరోలు బాలకృష్ణ , వెంకటేష్ సినిమాల్లో హోమ్లీ హీరోయిన్ గా నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మూవీ వకీల్ సాబ్ లో అంజలి కీల పాత్రలతో కనిపించి తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించింది. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, మాలీవుడ్ లోనూ అంజలికి మంచి క్రేజ్ ఉంది. అందం, నటనా నైపుణ్యంతో ఈ భామ గత కొన్నేళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. కథలను ఎన్నుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తన ఇమేజ్‌కు డ్యామేజ్ కాకుండా చూసుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కథ డిమాండ్ చేస్తే కీలక పాత్రల్లోనూ కనిపిస్తూ అంజలి అందరి దృష్టిలో పడుతోంది. తెలుగు, తమిళంలో ఈ భామ చాలా వరకు హిట్ సినిమాలను చేసింది. ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో అంజలి బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ముద్దు సీన్స్, పడకగది సన్నివేశాల గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా వరకు సినిమాల్లో ముద్దు సీన్స్ చాలా న్యేచురల్ గా వస్తాయని వాటిలో నటించక తప్పదని తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే ఆ సీన్స్ చేసేప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుందని, కానీ స్టోరీ డిమాండ్ చేసే చేయక తప్పదని తెలిపింది.
ఇంటర్వ్యూలో అంజలి మాట్లాడుతూ…” మూవీస్ లో ముద్దు సీన్లు కామన్. రొమాంటిక్ సన్నివేశాలు కూడా సహజంగానే తీస్తారని..స్టోరీకి అవసరమైతే ఈ రెండూ కచ్చితంగా ఉంటాయి. కాబట్టి వాటిని నటిగా చేయాల్సిందే. హీరోలతో ఇలాంటి సీన్స్ లో నటించేప్పుడు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సీన్స్ తీసేప్పుడు హీరో హీరోయిన్ మాత్రమే కాదు చుట్టూ చాలా మంది ఉంటారు. టెక్నీషియన్లతో పాటు తోటి నటీనటులు, జనాలు కూడా ఉంటారు. అక్కడ ఉన్నవారంతా నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారోనని భయం వేస్తుంది. ఎందుకంటే.. లవర్స్ మధ్య కెమిస్ట్రీ మిగితావారితో పోల్చితే వేరేలా ఉంటుంది. హీరోలతో కిస్సింగ్, రొమాంటిక్ సీన్స్ లో న్యేచురల్ గా నటించాల్సి ఉంటుంది. అందుకే కాస్త ఇబ్బందిగా ఉంటుంది” అంజలి తెలిపింది. దీంతో ప్రస్తుతం అంజలి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు తన పెళ్లిపై వస్తున్న వార్తలపైన ఈ సందర్భంగా స్పందించింది అంజలి..” కొంత మంది నా పర్సనల్ విషయాలను హైలెట్ చేస్తున్నారు. నా పెళ్లి గురించి ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు. అప్పట్లో జర్నీ హీరో జైతో నాకు లవ్ ఎఫైర్ ఉందని పుకార్లు పుట్టించారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాలని పెళ్లి కూడా అయిపోయిందని రూమర్స్ క్రియేట్ చేశారు. అయితే అవన్నీ కేవలం కల్పితాలు మాత్రమే అందులో ఒకటి కూడా నిజం లేదు. నా గురించి ఇలాంటి వార్తలు చూసినప్పుడు నవ్వొస్తుంది. అంతే కానీ వేటినీ సీరియస్‌గా తీసుకొను”అని చెప్పుకొచ్చింది అంజలి. ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో పలు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్‌లో సెకండ్ హీరోయిన్‌గా అంజలి కనిపించనుంది. అలాగే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ షూటింగ్ ఈ మధ్యనే షురూ అయ్యిందిజ వీటితో పాటు పలు తమిళ, మలయాళం చిత్రాల్లో నటిస్తోంది అంజలి.