Yakshini Deepam: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం ఎన్నో పరిహారాలను చేస్తూ ఉంటారు అదేవిధంగా చాలామందికి కూడా సొంత ఇంటి కల అనేది ఉంటుంది ఈ సొంత ఇంటి కల నెరవేర్చి విషయంలో కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా సొంత ఇంటి కల నెరవేరాలన్న లేదా ఆర్థిక ఇబ్బందులనుంచి పూర్తిగా బయటపడాలి అంటే మన ఇంట్లో ఈ దీపం వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అన్న లేకపోతే మనం కోరుకుంటున్నటువంటి మన సొంత ఇంటి కల నెరవేరాలి అన్న ఎలాంటి దీపం వెలిగించాలి అనే విషయానికి వస్తే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే మంగళవారం మన ఇంట్లో యక్షణి దీపం వెలిగించడం వల్ల ఈ ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ దీపం మంగళవారం వెలిగించాలి మంగళ గౌరీ దేవిని అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ పూజకు ఎర్రటి పువ్వులను ఉపయోగించాలి.
మంగళవారం పూజ గదిలో ఒక పీఠవేసి ఆ పీటపై ఎర్రని వస్త్రం కప్పి దానిపై రెండు ప్రమిదలను తీసుకొని ఆ ప్రమిదకు పసుపు కుంకుమలతో పూజ చేయాలి అదేవిధంగా ఆ ప్రమిదలను ఒకదానిపై ఒకటి ఉంచి అనంతరం మూడు వత్తులను కలిపి ఒక ఒత్తిగా తయారు చేయాలి ఇలా మూడు వత్తులను తయారు చేసుకొని నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అదేవిధంగా అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసి ఈ పూజను చేస్తూ లక్ష్మి అష్టోత్తర నామాలు చదువుకోవాలి. మంగళవారం ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తుంది అదే విధంగా సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది.