Hindu Funeral: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక మనిషి కడుపులో జీవం పోసుకుంటున్నప్పటి నుంచి వారు చనిపోయే వరకు వారికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలను సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తాము. ఇక మనిషి చనిపోయిన తర్వాత జరిగేది చివరిగా అంత్యక్రియలు అంత్యక్రియలను కూడా హిందూ సంప్రదాయాల ప్రకారమే నిర్వహిస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే అయితే అంతక్రియలు సమయంలో చితి పెట్టే ముందుగా చనిపోయిన వ్యక్తి వారసులు కుండలో నీటిని తీసుకొని మూడుసార్లు శవం చుట్టూ తిరిగి ఆ కుండకు రంధ్రాలు చేసి అనంతరం పగలగొడతారు.
ఇలా ఒకసారి పూర్తయిన తర్వాత ఒక రంధ్ర రెండోసారి పూర్తయిన తర్వాత మరొక రంద్రం అలా మూడుసార్లు పూర్తయిన తర్వాత ఆకుండను పగలకొడుతూ ఉంటారు. ఇలా కుండ పగలగొట్టడం వెనక ఉన్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. మన శరీరంలో ఆత్మ ఉన్నంతవరకే మనం ప్రాణాలతో ఉంటాము. ఎప్పుడైతే మనం చనిపోతామో అప్పుడు మన శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్లిపోతుంది కానీ ఆత్మ అక్కడే తిరుగుతూ మనల్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుందని పురాణాలు చెబుతూ ఉంటాయి.
ఇక చనిపోయిన తర్వాత కుండలో నీటిని పోసి పగలగొట్టడానికి కారణం ఏంటి అనే విషయానికొస్తే కుండా మన శరీరం లాంటిది అందులో ఉన్నటువంటి నీరు మన ఆత్మ ఇలా కుండను పగలగొట్టడం వల్ల నీరు బయటకు వస్తూ ఉంటుంది అలాగే మన శరీరం నుంచి కూడా ఆత్మ బయటకు వెళ్ళిపోతుందని అర్థం కుండ పగలగొట్టడంతో ఇక నీకు ఎలాంటి శరీరం లేదు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపో ఆత్మ అని చెప్పడమే సంకేతం అని అందుకే చితి పెట్టడానికి ముందు ఇలా కుండను పగలగొడతారని పురాణాలు చెబుతున్నాయి.