shani Dosham: శని దేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఒక్కసారి శని ప్రభావం మనపై కనుక పడింది అంటే ఏడు సంవత్సరాలు పాటు ఈ శని బాధలు తప్పవు అంటూ చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే శని ప్రభావ దోషం మనపై ఉండకూడదు అనుకునేవారు ఈ వస్తువులను తమ దగ్గర పెట్టుకోవడం వల్ల శని దేవుడు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని వారిపై చూపించరని తెలుస్తుంది. మరి ఏ వస్తువులను మనం దగ్గర పెట్టుకోవడం వల్ల శని ప్రభావ దోషం ఉండదు అనే విషయానికి వస్తే..
శని ప్రభావ దోషం మనపై ఉండకూడదు అంటే మనం ఏడు ఏకముఖి రుద్రాక్షలను పూజించడం ఎంతో మంచిది. ఈ రుద్రాక్షలను మనం వేసుకోవడం లేదా పూజ గదిలో పెట్టి పూజ చేయడం వల్ల శని ప్రభావ దోషం మనపై ఉండడమే కాకుండా సకల సంపదలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి నీలి రంగు రాయిని ధరించడం వల్ల కూడా శని ప్రభావ దోషం ఉండదు అయితే ఈ నీలిరంగు రాయిని ధరించేటప్పుడు పండితుల వద్దకు వెళ్లి వారి సలహాలు సూచనల మేరకు ధరించాల్సి ఉంటుంది. ఇక ఈ ఉంగరం ధరించలేని వారు దేవుడు గదిలో పెట్టి పూజ చేయడం వల్ల శని ప్రభావం మనపై ఉండదు.
వీటితోపాటు ఇనుప ఉంగరాన్ని ధరించడం వల్ల కూడా శని ప్రభావం మనపై ఉండదు. అయితే ఇనుప ఉంగరం ధరించాలి అనుకునేవారు శనివారం ఈ ఉంగరాన్ని ధరించడం ఎంతో మంచిది. వీటితోపాటు శమీ వృక్షాన్ని నాటి పూజించడం ఎంతో మంచిది అయితే ఈ వృక్షాన్ని నాటి పూజించే సమయం లేనివారు శని చాలీసా చదవటం వల్ల కూడా ఈ శని ప్రభావ దోషం నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు. ఇలా ఈ వస్తువులను పూజించడం లేదా దగ్గర పెట్టుకోవడం వల్ల ఎప్పటికీ శని దేవుడు తన ప్రభావాన్ని మనపై చూపించరని తెలుస్తుంది.