Childrens Care: ప్రస్తుతం చలికాలం కావడంతో వాతావరణంలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడంతో చాలామంది చిన్నపిల్లలు తొందరగా ఇన్ఫెక్షన్లకు గురిఅవ్వడం జరుగుతుంది. చాలామంది ముక్కు కారే సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాగే ప్రతిరోజు జ్వరం సమస్యలతో కూడా చిన్న పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఇలా తరుచు జ్వరం రావడానికి కారణం లేకపోలేదు. ఇలా చాలామంది పిల్లలు తరచూ జ్వరం సమస్యతో బాధపడుతున్నారు అంటే అందుకు గల కారణం…
యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్, న్యుమోనియా వంటివి ఉంటే పిల్లలకు రాత్రి జ్వరం వస్తుంది. కొంత మంది పిల్లలకు రాత్రి వస్తే.. ఇంకొంత మందికి మధ్యాహ్నం వస్తుంది. ఇలా జ్వరం వచ్చినప్పుడు ముక్కు కారండం, అసౌకర్యంగా, చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. చెవిలో ఇన్ ఫెక్షన్స్ ఉన్నా కూడా పిల్లలకు ఫీవర్ వస్తుంది. ఇన్ ఫెక్షన్స్ పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతుంది. అందుకే రాత్రి పూట చాలామంది జ్వరం సమస్యతో బాధపడుతూ ఉంటారు.
ఇలా పిల్లల తరచూ జ్వరం సమస్యలతో బాధపడుతూ కనుక ఉన్నట్లయితే వారిని ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావడానికి ఒకే ఒక్క మార్గం ఉంది వారికి బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలను అందించడమే కాకుండా పిల్లలు బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి వారికి కాలు చేతులను శుభ్రంగా కడిగి వారిని వీలైనంతవరకు శుభ్రంగా ఉంచడం వల్ల ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటారు. తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి ఇతర అనారోగ్య సమస్యలు కూడా వారిని చుట్టుముట్టవు.