Trisha : ఎట్టకేలకు కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ దిగొచ్చాడు. తాను నోరు జారినందుకు స్టార్ బ్యూటీ త్రిష కు సారీ చెప్పాడు. ఈ మధ్యనే త్రిషపై మన్సూర్ కంట్రోవర్సీ కామెంట్స్ చేశాడు. ఆ వ్యాఖ్యలు ఇండస్ట్రీ లో తీవ్ర దుమారాన్ని రేపాయి. మన్సూర్ తీరుతో సినీలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోలీవుడ్ , టాలీవుడ్ అన్న తేడా లేకుండా సినీ సెలబ్రిటీలు అందరూ త్రిషకు సపోర్ట్ గా నిలిచారు. మన్సూర్ పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఆయన మాత్రం సారీ చెప్పనని తేల్చి చెప్పాడు. అయితే, పరిస్థితి సీరియస్ కావడంతో ఓ మెట్టు దిగి త్రిష విషయంలో వెనక్కి తగ్గాడు. త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు.
మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ” ఎలాంటి రక్తపాతం లేకుండానే నేను వారం పాటు జరిగిన ఈ వార్ లో గెలిచాను. నాకు సపోర్ట్ గా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా కామెంట్స్ త్రిషకు బాధ కలిగించాయి. అందుకే సారీ చెబుతున్న. ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది’ అంటూ మన్సూర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు.
అసలు వివాదం ఎలా స్టార్ట్ అయ్యిందంటే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో లియో’ మూవీపై మన్సూర్ ‘ మాట్లాడారు.. లియోలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాను. అయితే త్రిషతో నాకు రేప్ సీన్ ఉంటుందని అనుకున్నా. నేను నటించిన చాలా సినిమాల్లో అలాంటి సీన్స్ ఉన్నాయి. త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని ఊహించను. కానీ అలా జరగలేదు. కశ్మీర్ షూటింగ్ లోనూ సెట్స్‌లో త్రిష కనిపించలేదు. అంటూ మన్సూర్ కంట్రోవర్సీ కామెంట్స్ చేశారు. దీంతో ఈ కామెంట్స్ సోషల్ వైరల్ అయ్యాయి. దీంతో మన్సూర్ తీరుతో సినీతారలు మండిపడ్డారు.
మరోవైపు ఈ ఘటనపై త్రిష కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. అంతేకాదు ఈ ఘటనపై లోకేశ్ కనగరాజ్, నటి మాళవికా మోహనన్, గాయని చిన్మయి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, హీరో నితిన్ సహా పలువురు స్టార్స్ త్రిషకు సపోర్ట్ గా ఉన్నారు. మన్సూర్ కామెంట్స్ ను ఖండించారు. ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నడిగర్ సంఘం సైతం మన్సూర్ పై తాత్కాలికంగా నిషేధం విధించింది. త్రిషకు సారీ చెబితేనే ఈ నిషేధాన్ని తొలగిస్తామని స్పష్టం చేసింది. దీనితో మన్సూర్ ఎట్టకేలకు త్రిషకు సారీ చెప్పాడు. త్రిష కూడా అతడిని ట్విట్టర్ వేదికగా మన్నించింది.