Banana: మన హిందూ సంప్రదాయాల ప్రకారం పండుగల సమయంలో దేవుడికి నైవేద్యంగా అరటిపండ్లను సమర్పిస్తూ ఉంటాము అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చిన లేదా ఏదైనా శుభకార్యం జరిగిన వారికి ఇచ్చే తాంబూలంలో అరటి పండ్లను పెట్టి ఇవ్వడం మనం చూస్తుంటాము. ఇలా అరటి పండ్లను మనం తాంబూలంలో ఇస్తూ ఉంటాము అయితే తాంబూలం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఒకే పండును ఇవ్వకూడదని చెబుతూ ఉంటారు.
చాలామంది తాంబూలం ఇచ్చే సమయంలో అరటి పండ్లు కనుక ఇస్తే చాలా మంచిది జరుగుతుందని కవల అరటి పండ్లను కూడా తాంబూలంలో పెట్టి ఇస్తూ ఉంటారు. ఇలా కవల అరటి పండ్లు తాంబూలంలో పెట్టి ఇవ్వడం మంచిదేనా అంటే మంచిది కాదని పండితులు చెబుతున్నారు. తాంబూలంలో కవల అరటి పండ్లను రెండు పనులతో సమానంగా భావించి ఇస్తుంటాము కానీ అవి కవల అరటి పండ్లు అయినప్పటికీ ఒక పండుతోనే సమానం.
ఒక పండుతో సమానమైనటువంటి కవల అరటి పండును ఎప్పుడు కూడా తాంబూలంలో పెట్టకూడదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఆ కవలపండ్ల జతకి మరొక అరటిపండు పెట్టి తాంబూలం ఇవ్వాలి. ఇలా ఇస్తే ఎంతో శుభం కానీ కేవలం కవల అరటి పనులను మాత్రమే తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. ఇక దేవుడికి నైవేద్యం సమర్పించే సమయంలో కూడా కవల అరటిపండ్ల జతకు మరొక అరటిపండును పెట్టి నైవేద్యంగా సమర్పించాలి.