Blurry Vision: సాధారణంగా చాలామంది ప్రస్తుత కాలంలో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ లాప్టాప్స్ కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడపడంతో కంటి చూపు పూర్తిగా మందగిస్తుంది. ఇలా చాలామంది చిన్న వయసులోనే కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విధంగా కంటి చూపు సమస్యలతో బాధపడేవారు వెంటనే తమ కళ్ళ విషయంలో జాగ్రత్త పడకపోతే పూర్తిగా దృష్టి కోల్పోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి అయితే చాలామందికి ఉదయం లేవగానే కళ్ళు మసక బారినట్లు కనిపిస్తూ ఉంటాయి.
ఈ విధంగా కళ్ళు మసకబారటం దేనికి సంకేతం ఎందుకు ఇలా కళ్ళు మసకబారినట్లు కనిపిస్తాయి అనే విషయానికి వస్తే… ఉదయం లేవగానే కొన్నిసార్లు మన కళ్ళు పూర్తిగా పొడిబారిపోయి ఉంటాయి మన కళ్ళు సరిగా కనిపించాలి అంటే కన్నీళ్లు ఎంతో ముఖ్యం అయితే ఇలా కన్నీళ్లు లేని సమయంలో కళ్ళు మసకబారినట్లు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో కనురెప్పలను పదేపదే కొట్టడం వల్ల తిరిగి యధావిధిగా కంటి చూపు కనపడుతుంది.
ఇక చాలామంది రాత్రి పడుకునే సమయంలో బోర్ల పడుకుని ఉంటారు అలాంటి సమయంలో మొహంపై కళ్ళపై అధిక ఒత్తిడి కలుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా ఉదయం లేవగానే కళ్ళు మసక బారినట్లు కనిపిస్తాయి. ఇక కళ్ళకు ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు ఉదయం లేవగానే కళ్ళు మొత్తం ఇలాగే మసకబారినట్టు కనపడుతుంటాయి. ఇక చాలామంది పడుకునేటప్పుడు బీపీ షుగర్ వంటి టాబ్లెట్లను ఉపయోగిస్తూ పడుకుంటారు. ఇలా ఇతర వ్యాధులకు మందులు ఉపయోగించే వారికి కూడా ఉదయం లేవగానే కళ్ళు మసకబారినట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కళ్ళు మసకబారినట్టు కనిపించడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయని చెప్పాలి.