Ayudha Pooja: ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో దసరా పండుగ ఒకటి. ప్రతి ఏడాది ఆశ్వాయుజ మాసంలో శుక్లపక్షంలోని పదవరోజు జరుపుకుంటారు.శ్రీరాముడు ఈ రోజునే రావణున్ని సంహరించాడని పురాణాలు చెబుతుంటాయి. అయితే పది రోజులపాటు దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి నవరాత్రి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇక దశమి రోజు రావణ సంహారం కూడా జరగడంతో ప్రజలందరూ కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
తొమ్మిది రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకొని ఈ పండుగలలో ఆయుధ పూజ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు అనే విషయం మనకు తెలిసిందే దసరాకు ముందు రోజు ఈ ఆయుధ పూజ జరుపుకుంటారు అయితే ఈ ఆయుధ పూజకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అసలు ఈ పూజ ఎందుకు జరుపుకుంటారు అనే విషయానికి వస్తే పురాణాల ప్రకారం 10వ రోజు రాముడు రావణుని పై గెలిచిన సందర్భంగా చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజని ఇలా చెట్టుపై ఉన్నటువంటి ఆయుధాలు తీసి వాటిని శుభ్రం చేసి పూజ చేసుకున్నారని తెలుస్తుంది. అందుకే మనం మన కుల వృత్తులకు ఉపయోగించే వస్తువులను కూడా ఆరోజు ఎంతో ఘనంగా పూజించాలని భావిస్తుంటారు.
ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ కూడా ఆయుధాల పూజను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇకపోతే ఈ ఏడాది దసరా పండుగ ఎప్పుడు వచ్చింది? సరైన ముహూర్తం తిథి ఎప్పుడు అనే విషయాన్ని వస్తే శుక్లాపక్ష దశమి తిధి సాయంత్రం 5:44 నిమిషాల నుంచి అక్టోబర్ 24 మధ్యాహ్నం 3:14 నిమిషముల వరకు ఉంటుంది. ఈ ఏడాది విజయదశమి పండుగను అక్టోబర్ 24వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజు సాయంత్రం 6:30 నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య రావణ దహనం నిర్వహించాలని పండితులు చెబుతున్నారు..