Health Tips: దానిమ్మ పండ్లు మన సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది దానిమ్మ గింజలను తింటూ వాటి తొక్కలను పడేస్తూ ఉంటారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే దానిమ్మ పండు తొక్కలో కూడా సమృద్ధిగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి. కావున ఇప్పటినుంచి దానిమ్మ తొక్కలను పడేయకుండా వీటితో కషాయాన్ని తయారు చేసుకుని సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనం పొందవచ్చు.
ప్రతిరోజు ఉదయాన్నే దానిమ్మ తొక్కల కషాయాన్ని సేవిస్తే ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ మైక్రోబియల్ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా వచ్చే అలర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. మరియు యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్న దానిమ్మ తొక్కల కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే నోట్లో పుండ్లు, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన, దంత క్షయం వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మరియు రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. జీర్ణశక్తిని పెంచి మలబద్దక సమస్యను తొలగిస్తుంది.
మరి దానిమ్మ తొక్కలో ఉండే ప్రయోజనాలు పొందాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని వస్తే దానిమ్మ తొక్కలను నీడలో బాగా ఎండబెట్టి వాటిని పొడి చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్నటువంటి ఈ పొడిని బాగా మరిగిన నీటిలోకి ఒక టేబుల్ స్పూన్ వేసి కషాయం తయారు చేసుకోవాలి అయితే ఇలా ఉత్తది తాగడానికి ఇబ్బంది పడేవారు రుచి కోసం కాస్త తేనె వాటిని కలుపుకొని కూడా తాగవచ్చు. ఇలా దానిమ్మ తొక్కలతో తయారు చేసుకున్నటువంటి ఈ కషాయం తాగటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు.