Health Tips: సాధారణంగా మనం పండ్లు ఏవైనా తినేటప్పుడు వాటిని కట్ చేసుకుని వాటిపై కాస్త ఉప్పు కారం, అలాగే కొన్ని పండ్ల పై చక్కెర కలుపుకొని తింటూ ఉంటాము. ఇలా చక్కెర ఉప్పు కలిపి తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఇలా పండ్ల మీద ఉప్పు చక్కెర కలుపుకొని తినడం ఆరోగ్యానికి మంచిదేనా అలా తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అనే విషయానికి వస్తే పండ్లను ఇలా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మనం పండ్లను తీసుకునేటప్పుడు వాటి సహజ గుణాలతోనే తీసుకోవాలి.కొన్ని పనులు తినడానికి చాలా తియ్యగా ఉంటాయి అలాంటి వాటిలోకి మరి చక్కెర కలుపుకుని తినడం వల్ల మనం అధిక మొత్తంలో కేలరీలను మన శరీరానికి అందించిన వారు అవుతాము. తద్వారా అధికంగా శరీర బరువు పెరగడానికి దోహదమవుతుంది. అందుకే పుచ్చకాయ వంటి పండ్లపై పొరపాటున కూడా చక్కెర కలుపుకుని తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
Health Tips:
ఇక చాలామంది ఉప్పు కూడా కలుపుకొని తింటూ ఉంటారు. ఇలా ఉప్పు కలుపుకొని తినడం వల్ల ఉప్పు పండ్లలో ఉన్నటువంటి నీటిని బయటకు పీల్చేస్తుంది. తద్వారా పండ్లలో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి.ఇలా పండలు ఉన్నటువంటి పోషకాలు బయటకు వెళ్లిపోయినప్పుడు మనం ఆ పండ్లను తిని కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు అందుకే ఎవరు కూడా పండ్ల