Turmeric: ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే వాటిలో పసుపు ఒకటి తప్పనిసరిగా ప్రతి ఒక్క వంటింట్లో కూడా పసుపు ఉంటుంది. పసుపు కేవలం వంటల గురించి రావడం కోసం మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటే పొరపాటే పసుపును ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు మన ఆహారంలో రుచి కోసం ఉపయోగించే పసుపులో ఎన్నో ఔషధ గుణాలతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు,యాంటీమైక్రోబియల్ గుణాలు యాంటీ ఫంగల్,యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నందున ప్రతిరోజు ఉదయాన్నే పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని సేవిస్తే మనము ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
ముఖ్యంగా జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి వంటి ఫ్లూ లక్షణాలతో బాధపడేవారు చిటికెడు పసుపు పొడిని గోరువెచ్చని పాలల్లో వేసుకొని ఉదయం, సాయంత్రం సేవిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. పసుపులోని సహజ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని విష పదార్థాలను తొలగించి క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. రక్తపోటు సమస్యలను తగ్గించడంలో పసుపు దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
Turmeric:
పసుపులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు తరచూ శ్వాస ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే వైరస్ ,బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను అదుపు చేసి బ్రాంకైటిస్, న్యుమోనియా, సైనస్, ఆస్మా వంటి వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది. తరచూ చర్మ ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో బాధపడేవారు పసుపు మిశ్రమాన్ని చర్మం పై లేపనంగా ఉపయోగిస్తే సహజ చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.ఇలా ప్రతిరోజు పసుపును ఉపయోగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.