Dimple Hayathi : డింపుల్ హయతి ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు టాలీవుడ్ లో ఈ అమ్మడి ఎంట్రీ ఒక సెన్సేషన్ అని చెప్పాల్సిందే. ఒకే ఒక పాటతో తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకుంది ఈ అందాల భామ. ఆ ఒక్క పాటతో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది. కుర్రాళ్ళ ఆల్ టైమ్ ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. ఊపులతో, షేపులతో అందరినీ కట్టిపడేసింది భామ
హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దల కొండ గణేష్ మూవీలో ఐటమ్ సాంగ్‌తో వెండి తెరపైన ఎంట్రీ ఇచ్చింది. అమ్మడి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిన రవితేజ డింపుల్ హయాతి ని తన మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. ఖిలాడి సినిమాలో ఓ వైపు గ్లామర్‌గా మరో వైపు లంగా ఓణీ వేసుకుని తన పాత్రకు న్యాయం చేసింది.
ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న డిపుల్ లేటెస్ట్ గా రామబాణం సినిమాలో మెరిసింది. ఈ మూవీ లోనూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో అలరించింది. సినిమా పెద్దగా హిట్ కాకపోయినా డింపుల్ మాత్రం తన వరకు పెర్ఫార్మన్స్ బానే చేసింది.
డ్యాన్స్ పరంగా ఈ భామ ఇరగదీస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. గద్దల కొండ గణేష్, ఖిలాడి సినిమాల్లో తన డ్యాన్స్ తో ఫిదా చేసింది. ఇప్పుడేమో ఫ్యాషన్ తో అందరిని ఆకట్టుకుంటుంది హయతి. తాజాగా ఈ బ్యూటీ ప్యాంట్ షర్ట్ వేసుకుని కుర్రాళ్ళకు పిచ్చెక్కిస్తోంది. అందరి చూపులను తన వైపు తిప్పుకుంటుంది. షర్ట్ బటన్స్ విప్పి తన లోలోపలి అందాలు కనిపించేలా బోల్డ్ ఫోటోషూట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందరూ క్రేజీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
హాఫ్ వైట్ కలర్ టైట్ ఫిట్ డెనిమ్ జీన్స్, దాని పైకి వైట్ అండ్ బ్లాక్ ఫుల్ స్లీవ్స్, కాలర్ నెక్ షర్ట్ వేసుకుని ఆదరగొట్టింది. అవుట్ ఫిట్ కు మ్యాచింగ్ గా మెడలో నెక్ లెస్, చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని గ్లామరస్ లుక్ లో అందరిని ఆకట్టుకుంది.