Mosquitos: మన ఇంటి పరిసరాలు చుట్టూ పరిశుభ్రత లేకపోయినా నీరు కనుక నిల్వ ఉంటే పెద్ద ఎత్తున దోమలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇలా దోమలు అధికంగా ఉండటంతో ఇంట్లో కూడా పెద్ద ఎత్తున మనం దోమ కాటుకు గురి కావడమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు బారిన పడాల్సి ఉంటుంది.ఇలా దోపకాటువల్ల ఎంతోమంది చాలా విషపూరితమైన అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారు. ఇలా దోమల నుంచి మనం బయటపడటానికి ఎన్నో నివారణ మార్గాలను చేపడుతూ ఉంటాము.
చాలామంది దోమతెరలను వాడగా మరికొందరు మస్కిటో కాయిల్స్ ఆల్ఔట్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చాలామందికి ఈ మస్కిటో కాయిల్స్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలామందికి వీటి నుంచి వచ్చే వాసన పోగ అలర్జీకి కారణమవుతుంది. ఇలాంటివారు చాలా న్యాచురల్ గా, సింపుల్ చిట్కాలను ఉపయోగించి ఈ దోమల నుంచి మనం బయటపడవచ్చు.
Mosquitos
దోమల సమస్య నుంచి బయటపడాలి అంటే ఇంట్లో మనం బిర్యానీకి ఉపయోగించే ఆకును వెలిగించి ఒక గదిలో పెట్టడం వల్ల ఆకు నుంచి వచ్చే పొగ ద్వారా ఇంట్లో దోమలు లేకుండా వెళ్ళిపోతాయి. ఒక గ్లాసు నీటిని తీసుకొని అందులో కాస్త కర్పూర బిళ్ళను వేయటం వల్ల ఈ దోమల బెడద నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా వారానికి ఒక్కసారైనా కూడా పూజ చేసిన అనంతరం ఇంట్లో సాంబ్రాణి పొగ వేయాలి. ఇలా సాంబ్రాణి పొగ వేయటం వల్ల కూడా దోమలు ఇంటి నుంచి వెళ్లిపోతాయి. సింపుల్ చిట్కాలతో దోమల సమస్య నుంచి మనం విముక్తి పొందవచ్చు.