Technology: సాంకేతిక విజ్ఞానం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నడూ లేని విధంగా గత 25 ఏళ్ల కాలంలో టెక్నాలజీలో ఎన్నో ఊహించని మార్పులని చూస్తున్నాం. ఓ విధంగా జెట్ స్పీడ్ తో ఈ విజ్ఞానం దూసుకుపోతుంది. ల్యాండ్ లైన్ ఫోన్ వాడే కాలం నుంచి ఈ పాతికేళ్ళలో 4జీ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్స్ వాడే స్థాయికి వచ్చేసాం. అలాగే ఇంటర్నెట్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడొక అత్యవసర వస్తువు క్రింద అయిపొయింది.
అలాగే ఇంటర్నెట్ వినియోగం కూడా మానవ మనుగడలో ఒక కీలక భూమిక పోషిస్తుంది. ప్రపంచాన్ని ఇప్పుడు ఇంటర్నెట్ శాసిస్తుంది అని చెప్పాలి. కోట్లాది మంది ఇంటర్నెట్ ఆధారంగానే ఉద్యోగాలు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ పనులన్నీ కూడా అంతర్జాల ప్రపంచం ద్వారానే కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ మానవ మేధస్సు లేకుండా పనిచేసే స్థాయికి చేరిపోయింది. ఆటోమిషన్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మానవ మేధస్సుని కూడా పసిగట్టే స్థాయిలో టెక్నాలజీ అభివృద్ధి చెందింది.
మన చేతిలో ఉన్న ఫోన్ కూడా ఒక రోబోలా మన మాట, ఆలోచనని బేస్ చేసుకొని నడిచే స్థాయికి విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఇండియాలో 4జీ టెక్నాలజీ నడుస్తూ ఉంటె జపాన్, అమెరికా లాంటి దేశాలు 5జీలో నడుస్తున్నాయి. వచ్చే ఏడాది నాటికి ఇండియాలో కూడా 5జీ టెక్నాలజీ తీసుకొచ్చే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. ఇదిలా ఉంటే రానున్న 8 ఏళ్లలో టెక్నాలజీలో ఊహించని ఎన్నో మార్పులని మనం చూడబోతున్నాం అని విజ్ఞాన ప్రపంచం అభివృద్ధి చూస్తూ ఉంటే అర్ధమవుతుంది.
ఇదిలా ఉంటే 2030 నాటికి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్ లు పూర్తిగా కనుమరుగావుతాయని నోకియా సీఈవో పెక్కా లాండ్మార్క్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా తన ప్రసంగంలో పేర్కొనడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. భవిష్యత్తులో 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్ లు పాతబడిపోతాయని, కేవలం పురాతన వస్తువులుగా మాత్రమే గుర్తించబడతాయని చెప్పారు. స్మార్ట్ ఫోన్ లలో చాలా ఫీచర్స్ శరీరంలోనే నేరుగా అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. న్యూరాలింక్ బేస్ డివైజ్ లని న్యూరాలింక్ అనే సంస్థ ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో కమ్యునికేషన్ రంగంలో అవి చాలా కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.