Dark Circles: అమ్మాయిలకు అందం ఎంతో ముఖ్యమని భావిస్తూ ఉంటారు.అందం కోసం ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేస్తూ తమ అందాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు.అయితే అమ్మాయిలు ఇటీవల కాలంలో ఎక్కువగా బాధపడుతున్నటువంటి సమస్యలలో కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. ఇలా కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడటం వల్ల తమ అందానికే ఇబ్బందిగా మారుతూ ఉన్నటువంటి తరుణంలో ఎంతోమంది ఈ నల్లటి వలయాలు తొలగిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
సాధారణంగా ఇలా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడానికి కారణం ఆహారపు అలవాట్లు సరైన నిద్ర లేకపోవడం పని ఒత్తిడి వంటివి ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. ఈ విధంగా పలు కారణాలవల్ల కంటి చుట్టూ ఏర్పడిన ఈ నల్లటి వలయాలను తగ్గించడానికి మన ఇంట్లో లభించే చింతపండుతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని చెప్పాలి.
ఇంట్లో లభించే చింతపండును కొద్దిగా తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టి మెత్తని మిశ్రమం లాగా తయారు చేయాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమానికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఇలా నిమ్మరసం కలిపిన ఈ చింతపండు పేస్ట్ నల్లటి వలయాల కింద అప్లై చేయాలి. ఈ మిశ్రమం బాగా ఆరిన తర్వాత చల్ల నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలు కొద్ది రోజులలోనే మాయమవుతాయి.