Business: కాలుష్యం పెరగడం, పునరుత్పాదక వనరుల క్షీణత తో పాటు గాలి నాణ్యత తగ్గడంతో, ప్రపంచవ్యాప్తంగా ఎకో ఫ్రెండ్లీ పవర్ కు, టెక్నాలజీ సొల్యూషన్స్ విపరీతమైన వృద్ధిని సాధించింది. ఈ వృద్ధిని చూసి పర్యావరణ బాధ్యత కలిగిన శక్తి , సాంకేతిక పరిష్కారాల ఆవశ్యకతను తెలుసుకుని, గత కొన్ని సంవత్సరాలలో అనేక క్లీన్‌టెక్ స్టార్టప్‌లు ఉద్భవించాయి. ఈ క్రమంలో ప్రపంచాన్ని పరిశుభ్రంగా, పచ్చగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ గురించి ఇప్పుడు తెలసుకుంది. ఏపీ సోలార్ వర్క్స్ అనేది ఇండోర్ ఆధారిత రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ క్లీన్‌టెక్ స్టార్టప్ కంపెనీ . 2016లో అక్షయ్ గుప్తా పంకజ్ యాదవ్ లు ఈ స్టార్టప్ కంపెనీని స్థాపించారు.
ఇది బూట్‌స్ట్రాప్డ్ స్టార్టప్ కంపెనీ. క్లయింట్‌లకు సౌరశక్తి పరిష్కారాలను అందించేందుకు పనిచేస్తుంది. ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా కంపెనీ ఉత్పత్తులను కూడా రూపొందిస్తూ మార్కెట్‌లో నిలబడుతోంది. ఏపీ సోలార్ వర్క్స్ ప్రపంచాన్ని పరిశుభ్రంగా, పచ్చగా మార్చాలనే లక్ష్యంతో ప్రారంభించబడిన కంపెనీ. ఈ స్టార్టప్ వివిధ పరిశ్రమలు, ఇన్‌స్టిట్యూట్‌లు, కార్యాలయాలు, గృహాలు, పాఠశాలలతో పాటుగా పవర్ ప్లాంట్‌లకు సౌరశక్తి పరిష్కారాలను అందిస్తోంది. భారతదేశం ఇప్పటికీ బొగ్గు వంటి సాంప్రదాయిక వనరులపై ఆధారపడి ఉండటం వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతోందని అందుకే ఈ పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వ్యవస్థాపకులు తెలిపారు.
ఈ కంపెనీ ప్రస్తుతుం 8 రకాల విభిన్నమైన సోలార్ ప్యానెల్ సిస్టమ్‌లను అందిస్తోంది. అత్యంత నైపుణ్యం , సమర్థవంతమైన నిపుణుల బృందంతో, ఈ క్లీన్‌టెక్ స్టార్టప్ తన క్లయింట్‌లకు క్లాస్‌లో అత్యుత్తమ సౌరశక్తి పరిష్కారాలను అందించడానికి సరికొత్త సాంకేతికత ,ఆవిష్కరణలను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం కంపెనీలో 25 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్లీన్‌టెక్ స్టార్టప్ కంపెనీ ఇప్పటి వరకు 300కుపైగా ప్రాజెక్ట్‌లను ఇన్‌స్టాల్ చేసింది, 3.5 కోట్ల వార్షిక ఆదాయాన్ని పొందుతోంది. ఏపీ సోలార్ వర్క్స్ ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణతో సహా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ తమ సేవలను విస్తరించాలని ఆలోచిస్తోంది. అదే విధంగా వచ్చే మూడేళ్లలో సంవత్సరానికి రూ.100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.