YSRCP: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ బలమైన రాజకీయ వ్యూహాలతో వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే మరల తమని అధికారంలోకి తీసుకు వస్తాయని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఇక జగన్ సూచించిన మార్గంలోనే నాయకులు అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం నిర్దేశించిన విధంగానే మార్గంలోనే ప్రతిపక్షాలపై మాటలతో దాడి చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే భౌతిక దాడులకి కూడా తెగబడుతూ అసలు ప్రతిపక్షాలకి ఓట్లు వేయకుండా ప్రజలని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది కొంత మంది ఆరోపణ.
అయితే వైసీపీకి గ్రౌండ్ లెవల్ లో సర్పంచ్ ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. దీనికి కారణం కూడా ఉంది. పంచాయితీ రాజ్ నిందులని వైసీపీ ప్రభుత్వ పథకాలకి వాడుకుంటుంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో క్యాడర్ లో కూడా అంత సంతృప్తికరంగా లేరు. అయితే వైసీపీకి గ్రామీణ స్థాయిలో ఉండే పెద్ద బలం వాలంటీర్ వ్యవస్థ. ప్రతి 50 ఉల్లకి ఒక వాలంటీర్ ని నియమించడం ద్వారా జగన్ పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరందరూ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా వైసీపీ పార్టీ కోసం పని చేస్తున్నారు.
ఇక ఎన్నికల ముందు వారిని ఉత్తమ వాలంటీర్ గా జిల్లాల వారీగా గుర్తించి వారికి క్యాష్ ప్రైజ్ ఇచ్చి గౌరవిస్తోంది. తద్వారా వాలంటీర్ల ద్వారా గ్రౌండ్ లెవల్ లో సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయించి ఓటుబ్యాంకు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తోంది. తాజాగా విజయవాడలో జరిగిన వాలంటీర్లకి వందనం కార్యక్రమం ద్వారా వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తే మీ ఉద్యోగాలు పోతాయని జగన్ నేరుగానే చెప్పారు. అందుకే వైసీపీకి తనకి సైన్యంగా అందరూ పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో మీరే వైసీపీ లీడర్లు అంటూ కొత్తగా మరో భరోసా జగన్ ఇచ్చారు.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.