YS Jagan: సారథులు లేక సతమతం అవుతున్న జగన్

YS Jagan: ఏపీలో అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలలో కూడా గెలవాలని గట్టిగా ప్రయత్నం చేస్తుంది. దానికోసం కొత్తగా పార్టీ కోసం పనిచేసేందుకు గృహ సారథులని ఏర్పాటు చేస్తుంది. ఈ బాధ్యతని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లకి ముఖ్యమంత్రి జగన్ అప్పగించారు. ఫిబ్రవరి నెల ఆఖరు నాటికి గృహసారథులు సిద్ధం కావాలని అల్టిమేటం జారీ చేశారు. ప్రతి 50 ఇళ్ళకి ముగ్గురు సారథులు ఉండే విధంగా నియామకం చేపట్టాలని తెలిపారు. వారందరూ కూడా పార్టీ కోసం పని చేస్తూ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ఈ నేపధ్యంలో నియోజకవర్గ స్థాయిలో గృహ సారథులని నియమించే దిశగా అందరూ అడుగులు వేస్తున్నారు.

ys-jagan-next-election-campaign-struggle

అయితే వాలంటీర్లని గతంలో నియమించి వారికి ప్రభుత్వం నుంచి 5 వేల గౌరవ వేతనం ఇస్తున్నారు.  అయితే ఇప్పుడు ఉన్న గృహసారథులు ఎవరూ కూడా రూపాయి కూడా ఆశించకుండా పార్టీ  కోసం కూలీల మాదిరిగా పనిచేయాలి. అయితే ఎన్నికల సమయంలో వీరి చేతుల మీదుగానే వైసీపీ డబ్బులు పంపిణీ చేయాలని భావిస్తుంది. అయినా కూడా ఉద్యోగాలు వదులుకొని, ఖాళీగా రూపాయి లాభం లేకుండా వైసీపీని గెలిపిస్తే తమకి వచ్చే లాభం ఏంటి అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్న మాట.

ఈ నేపధ్యంలో గృహ సారథులుగా పనిచేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదని తెలుస్తుంది. ఇక తల్లిదండ్రులు కూడా తమ పిల్లలని గృహ సారథులుగా నాయకుల జెండాలు మోయడానికి పంపించడానికి సిద్ధంగా లేరు. తమ పిల్లలు గ్రామంలో ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే గ్రామ సారథుల పేరుతో వైసీపీ అధిష్టానం కుర్రాళ్ళని పార్టీ సేవకులుగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో గృహ సారథుల నియామకం నాయకులకి తలకుమించిన భారం అవుతుందనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. 

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.