Categories: LatestNewsPolitics

AP Politics: ముందస్తుకి మొగ్గు చూపిస్తున్న జగన్… అందుకే ఢిల్లీలో చక్రం

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజురోజుకీ ఎన్నికల వేడి పెరిగిపోతోంది. మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు వచ్చేస్తాయి అన్నంతగా ప్రధాన పార్టీలన్నీ కూడా తమ వ్యూహాలను అమలు చేసుకుంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. వచ్చే ఎన్నికలలో ఏకంగా 175 నియోజకవర్గాలలో గెలిచి అధికారంలోకి రావాలని వైయస్సార్సీపి భావిస్తూ ఉంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా రానున్న ఎన్నికలలో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే అనే పంతంతో ఉంది. దీనికోసం అవసరమైన విధంగా చంద్రబాబు నాయుడు వ్యూహాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఆ పార్టీకి నూతన ఉత్తేజం అందించింది.

ఇదే ఊపులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దూసుకుపోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బలమైన ఓటు బ్యాంకు సొంతం చేసుకొని అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలిచి తీరాల్సిందే అనే ఆలోచనతో వ్యూహాలను అమలు చేస్తున్నారు. కుదిరితే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం లేదంటే ఒంటరిగా పోటీ చేసి వీలైనంత ఎక్కువ స్థానాల్లో గెలవడం జనసేన ముందున్న లక్ష్యం. తద్వారా అధికారంలో భాగస్వామ్యం కావడం ముఖ్యమంత్రి పీఠంపై పవన్ కళ్యాణ్ కూర్చోవాలని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారం రోజులు వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. దీని వెనుక జగన్ వ్యూహాత్మక ఆలోచన ఉందనే మాట వినిపిస్తుంది. బిజెపి పార్టీని దగ్గర చేసుకోవడం తద్వారా రానున్న ఎన్నికలలో వారి సహకారంతో అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. అలాగే ముందస్తు ఎన్నికలకి వెళ్ళే ఆలోచనని కూడా కేంద్రంలోని పెద్దలతో పంచుకొబోతున్నారు అని తెలుస్తుంది. తెలంగాణతో పాటు ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కోరనున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ప్రజా వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకి వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది.

Varalakshmi

Recent Posts

Naga Babu : నేను డిలీట్ చేశా..మళ్లీ గెలిగిన నాగబాబు

  Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. నెట్టింట్లో జరిగే ప్రతి…

14 hours ago

Spiritual: కుటుంబంలో మరణించిన వ్యక్తి దుస్తులను ధరించవచ్చా.. గరుడ పురాణం ఏం చెబుతోంది?

Spiritual: ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్క ప్రాణికి మరణం అనేది తప్పదనే సంగతి మనకు తెలిసిందే అయితే కొందరు…

15 hours ago

Chapati Dough: కలిపిన చపాతి పిండిని ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా.. ప్రమాదం ఉన్నట్టే?

Chapati Dough: చాలామంది ఒకసారి చపాతి పిండిని ఎక్కువ మొత్తంలో కలిపి ఉదయం లేదా సాయంత్రం చేసుకోవడానికి పనికి వస్తుందని…

16 hours ago

Chandrakanth : పవిత్ర నేను వస్తున్న..త్రినయని సీరియల్ నడుటు సూసైడ్

Chandrakanth : టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బుల్లితెర నటుడు చంద్రకాంత్‌ సుసైడ్ చేసుకున్నాడు. ఈ మధ్యనే…

18 hours ago

Rashmika Mandanna : రష్మిక వీడియోపై ప్రధాని మోదీ రియాక్షన్

Rashmika Mandanna : భారత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి…

2 days ago

Prabhas : ఆ స్పెషల్ వ్యక్తి ఎవరు?..ప్రభాస్ ట్వీట్ వైరల్

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‎కు అదిరిపోయే గుడ్ న్యూస్ . ఉన్నట్లుండి డార్లింగ్ సోషల్ మీడియాలో…

2 days ago

This website uses cookies.