Categories: Devotional

Ugadi: ఉగాది రోజే సూర్యగ్రహణం.. పండుగ పై ప్రభావం చూపనుందా?

Ugadi: 8 ఏప్రిల్‌ 2024 ఫాల్గుణ మాస బహుళ పక్ష అమావాస్య తిథి. శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో అఖరి రోజు. అతిపెద్ద సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో సంభవించదని అందువల్ల భారతదేశంలో గ్రహణ సూతకం వంటివి పాటించాల్సిన అవసరంలేదు అయితే ఈ సూర్యగ్రహణం ఉగాది పండుగ రోజు ఏర్పడుతుంది కాబట్టి ఆ రోజు దేవాలయాలని కూడా భక్తులతో కిటికీటలాడుతూ ఉంటాయి.

ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఈ ప్రభావం పండుగపై ఏమాత్రం ఉండదని తెలుస్తుంది అయితే ఈ సూర్యగ్రహణ ప్రభావం కొన్ని రాశుల వారికి శుభాలను కలిగించగా మరికొన్ని రాశుల వారు ఈ సూర్యగ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలుగు వారు కూడా ఈ గ్రహణ నియమాలను పాటించడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ సంపూర్ణ సూర్య గ్రహణం రేవతి నక్షత్రం మీన రాశిలో ఏర్పడటం చేత మీనరాశిలో రవి, చంద్ర, శుక్ర, రాహువులు ఉండటం చేత ఇతర దేశాలలో ఉన్న మీనరాశి జాతకులు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటమే మంచిది.

సూర్యగ్రహణం సమయంలో సూర్యారాధన ,దుర్గాదేవిని ఆరాధించడం, గ్రహణ శాంతులు వంటివి చేసుకోవడం వల్ల మనపై ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక సూర్యగ్రహణం మీనరాశిలో ఏర్పడటం వల్ల పశ్చిమ దేశాలకు అరిష్టాన్ని ఈ గ్రహణం సూచిస్తోంది. పశ్చిమ దేశంలో ఉన్నటువంటి వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తుంది అలాగే ఈ గ్రహణం కారణంగా మీనరాశి వారు కాస్త ఉద్యోగ , ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.